పెళ్ళైన ప్ర‌తి స్గ్రీ త‌ల్లి కావాల‌ని ఆలోచిస్త‌ది. పిల్ల‌లు పుట్ట‌క‌పోతే దాని కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి గుళ్ళు గోపురాలు తిరిగేస్తూ ఉంటారు చాలా మంది. పిల్లలు పుట్టని వారి విషయంలో సాధారణంగా భర్తకి వీర్యం పరీక్ష, భార్యకి డి అండ్‌ సి, హిస్టోపథంలాజికల్‌ ఎగ్జామినేషన్‌, హిస్ట్రోసాల్పింగో గ్రామ్‌, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా లోపం ఏదైనదీ ఉంటే కామ‌న్‌గా తెలుస్తుంది.

 

కొందరికి పై పరీక్షల్లో సరైన లోపం కనబడదు. అటువంటప్పుడు హార్మోన్‌ టెస్టులు, ఇతర టెస్టులు చేయవలసి వుంటాయి. అండం విడుదలలేని స్త్రీలలో 'ఫెర్టయిల్‌'  వంటి బిళ్ళలు ఒక క్రమపద్ధతిలో వాడటం, అవసరం బట్టి హార్మోన్‌ టెస్టులు, ఇతర టెస్టులు చేయవలసి వుంటాయి. అవసరం బట్టి హార్మోన్‌ ఇంజక్షన్లు వాడటం జరుగుతుంది. దానివల్ల అండం విడుదలై గర్భం వస్తుంది.

 

పురుషుల విషయంలో కూడ వీర్య కణాలు తగినన్ని లేకపోయినా, జీవం లేకపోయినా ఫెర్టయిల్‌ విం బిళ్ళలు, హార్మోన్‌ ఇంజక్షన్లు వాడవలసి వుంటుంది. కొందరు పురుషులకి వేరికోసిల్‌ వల్ల వీర్యకణాల సంఖ్య దెబ్బతింటుంది. వారికి వేరికోసీల్‌ ఆపరేషన్‌ చేసి లోపాన్ని సరిదిద్దాలి. మ‌రి ఇలాంటి మెడిక‌ల్ టెస్ట్‌లేమైనా ఉంటే ముందుగా ప‌రీక్షించుకుని ఆపై పిల్ల‌ల కోసం ప్ర‌య‌త్నించాలి. ప్ర‌స్తుత రోజుల్లో తినే ఆహార లోపాల వ‌ల్ల అనేకనేక కార‌ణాల వ‌ల్ల కూడా పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్టంగా మారింది. కొందరిలో కొవ్వు శాతం పెర‌గ‌డం వ‌ల్ల పిల్ల‌లు పుట్ట‌డ‌మ‌నేది చాలా క‌ష్ట‌త‌రంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: