సృష్టికి మూలం అమ్మ. ప్రతి వ్యక్తికీ ఆది గురువు అమ్మ. నిస్వార్థమైన ప్రేమకు ప్రతి రూపం అమ్మ. అమ్మ తన ప్రేమని స్వార్థం లేకుండా అందిస్తుంది.. అమ్మకు బిడ్డల మీద ప్రేమ ఎటువంటిది అంటే ఒక బిడ్డ ను కనాలి అంటే ఆమె రక్తాన్ని బిడ్డగా చెయ్యాలి, తాను పునర్జన్మ ఎత్తాలి, తల్లి అవ్వడం కోసం తన ప్రాణాన్ని పణ్ణంగా పెట్టాలి. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం భ‌య‌ప‌డ‌దు. అందుకే ఆమె త్యాగమూర్తి. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ అంటే తొమ్మిది నెలల లెక్క కాదు...చిరకాల దీవెన. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలు పాటించాలి.

 

అంతే కాదు భార్య కోరికమేరకు నడుచుకోవాలి. ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డకూడా సంతోషంగా..ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భర్త చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. భార్య గ‌ర్భం దాల్చాక ఆరు నెల‌ల స‌మ‌యం త‌రువాత భర్త క‌టింగ్ అస్స‌లు చేయించుకోకూడ‌దు. క‌నీసం షేవింగ్ కూడా చేసుకోకూడ‌దు. భార్య గర్భం ధాల్చిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడం భార్యను విడిచి దూరంగా వెళ్ళడం లాంటివి చేయకూడదట.

 

పర్వతారోహణము, యుద్దము చేయుట వంటివి వాటికి దూరంగా ఉండాలి. ఇంటికి స్తంభ ముహోర్తము గానీ, గ్రుహారంభము కానీ, వాస్తుకర్మ కానీ, చేయకూడదట. మ‌రియు భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త స‌ముద్ర స్నానం చేయ‌కూడ‌దు. అలాగే చెట్ల‌ను కూడా న‌ర‌క‌కూడ‌ద‌ట‌.  శ్మ‌శానాల‌కు శవాల‌ను తీసుకెళ్లే అంతిమ యాత్ర‌లో శ‌వాలను మోయ‌కూడ‌దు. అలా చేస్తే పుట్టే బిడ్డ‌కు అరిష్టం క‌లుగుతుంద‌ట‌. అదేవిధంగా భార్య గర్భం దాల్చిన ఏడోవ‌ నెల మొదలైనప్పటి నుండి తీర్థయాత్రల‌కు వెళ్ల‌కూడ‌ద‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: