దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. దీపాన్ని పరబ్రహ్మతో పోలుస్తారు. దీపం అంటే వెలుగు. దీపం అంటే మార్గదర్శి. దీపం అంటే చీకట్లు పోగొట్టేది. దీపం మనకు ఎన్నో జీవిత సత్యాలు చెబుతుంది. మీరెప్పుడైనా గమనించారో లేదో.. ఈసారి దీపారాధాన చేసినప్పుడు గమనించండి.

 

అదేమిటంటే.. దీపం వెలుగుతున్నప్పుడు నీలం, పసుపు, తెలుపు రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులూ విజ్ఞానం, విచక్షణ, వినయ భావాలకు సంకేతాలు. అంతే కాదు.. వీటిని త్రిమాతలకు ప్రతిరూపాలుగానూ భావిస్తారు. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. దీపాన్ని మూడు వత్తులతో కలగలిపి వెలిగించమంటారు.

 

ఇలా ఎందుకు చెబుతారో తెలుసా.. ఈ మూడు వత్తులు- సత్త్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. మనలో ఈ మూడు గుణాలు ఉంటాయి. మనం అంటేనే.. ఈ మూడు గుణాల కలయిక. అందుకే.. మనసులో పరమాత్మ రూపాన్ని ఏకీకృతంగా నిలుపుకొని, ఆత్మ దీపారాధన చేయాలి. ఏకాగ్రచిత్తంతో అంతర్వీక్షణంలో జ్ఞానదీప ప్రజల్వన చేస్తూ, ఆ దీపకాంతిలో దైవాన్ని దర్శించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: