సాధారణంగా ప్రతీ ప్రాంతానికి కొన్ని ఆనవాయితీగా వచ్చే సాంప్రదాయపు  విశిష్టతలు ఉంటాయి. వాటికి తగినట్టుగా పండుగలు, విశేష రోజులు కూడా  ఉంటాయి. అక్కడ ఆ ప్రాంతంలో ఉండే వారికి అవెంతో నమ్మకమైనవే అయినా, మిగతావారికి కొంచెం వింతగా, కొత్తగా ఉంటాయి. ఎక్కడైనా సరే సాంప్రదాయపు పండుగలని ఊరూరా  అందరూ కలిసి జరుపుకుంటారు. జనం కూడా వేల సంఖ్యలో పాల్గొంటారు.అయితే ఈ తరహా సంప్రదాయ పండుగ ఒకటి ఇటీవలే జపాన్ లో జరిగింది..ఈ వేడుకలని చూసిన ప్రతీ ఒక్కరూ ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

 

 

ఏటా ఫిబ్రవరి 3వ వారంలో జరిగే ‘హడాకా మట్సూరీ’ అనే ఈ జపాన్ సాంప్రదాయ పండుగ హోన్షు ద్వీపకల్పంలోని సైదీజీ ఆలయ ప్రాంగణంలో ప్రతీ ఏటా జరుగుతుంది. జపాన్ లోని మగవారు కేవలం గోచీలు మాత్రమే ధరించి ఈ సంబరాల్లో పాల్గొంటారు.  ఈ సారి 10వేల మందికి పైగా పాల్గొనారు. ఆ ప్రాంతంలో లభించే మద్యాని సేవించి ఆ ఆలయం చుట్టూ పరిగెట్టుతారు. ఈ క్రమంలోనే పూజారి వీరిపై చల్లని నీళ్ళను చిలకరించగా వీరు పునీతులైనట్లు భావిస్తారు. ఇంతటితో అవలేదు, తరువాత ఆ పూజారి రాత్రి 10 గంటలకు 100 బండ్ల చెట్ల కొమ్మలను, రెండు అదృష్ట కర్రలను జనం లోకి విసురుతారు. అయితే..

 

ఆ రెండు అదృష్ట కర్రల కోసం అన్ని వేల మంది పోటీ పడతారు. ఆ కర్రలు దక్కిన  వారు పూర్తిగా సంబరాల్లో మునిగిపోతారు. సుమారుగా 30  నిమిషాల పాటు జరిగే ఈ సంబరాల్లో కొంతందికి స్వల్ప గాయలైతే, మరికొంతమంది ఆస్పత్రి పాలు కూడా అవుతుంటారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఈ ఉత్సవం జపాన్ వాసులు జరుపుకుంటున్నారు. ఈ పండుగను పంటలు కోతకు వచ్చిన సమయంలో జరుపుకోవడం వలన పంటలు బాగా పండి, అందరు సంతోషంగా ఉంటారని, నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సారి ఉత్సవంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకుండా బయటపడ్డారు జపాన్ వాసులు. అక్కడ ఈ పండుగని నగ్న పండుగ అని కూడా అంటారు..ఈ పండుగ చూడటం కోసం ప్రజలు తండోప తండాలుగా వస్తారు...

మరింత సమాచారం తెలుసుకోండి: