సృష్టికి మూలం అమ్మ. ప్రతి వ్యక్తికీ ఆది గురువు అమ్మ. నిస్వార్థమైన ప్రేమకు ప్రతి రూపం అమ్మ. ప్రేమించడం తప్ప ప్రేమను ఆశించదు. ఆమెకు బిడ్డ ఆకలి తప్ప తన ఆకలి తెలియదు. బిడ్డ బాగోగులు తప్ప తన మంచి చెడ్డలు అసలే పట్టవు. అందుకే ఆమె త్యాగమూర్తి. ఇక ప్ర‌తి మ‌హిళా అమ్మ అవ్వ‌డం అంటే మ‌రో జ‌న్మ ఎత్త‌డ‌మే. అలాగే ప్రెగ్నన్సీ సమయంలో మిమ్మల్ని, మీ కడుపులోని బిడ్డను కాపాడుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల‌న్న సంగ‌తి తెలిసిందే. ఏ పని చేయతగినదో..,ఏ పని చేయకుడనిదో పది మందిని అడిగి మరి తెలుసుకుని చేస్తారు. 

 

అయితే ప్రెగ్నన్సీ టైమ్‌లో మెట్లు ఎక్కడం మీద అనేక అనుమానాలు ఉంటాయి. ప్రెగ్న‌న్సీ టైమ్‌లో అస‌లు మెట్లు ఎక్క‌కూడ‌ద‌ని కూడా చెబుతుంటారు. కానీ, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నన్సీ సమయంలో మెట్లు ఎక్కడం ప్రమాదమేమీ కాదు. ప్రెగ్నన్సీ మొదటి రోజులలో మెట్లు ఎక్కే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, గర్భం పోయే అవకాశం ఉంటుంది. అదే ప్రమాదం నెలలు నిండిన తరువాత జరిగితే కాన్పు ముందే జరిగిపోయే ప్రమాదం ఉంటుంది. 

 

అందుకే ప్రెగ్నన్సీ సమయంలో మెట్లు  ఎక్కుతున్నప్పుడు కొన్ని జాగ్ర‌త్తులు తీసుకోవాలి. నెమ్మ‌దిగా ఎక్క‌డం, చేపట్టు పట్టుకుని ఎక్క‌డం, చీర ధ‌రంచిన‌ప్పుడు కూడా మ‌రింత జాగ్ర‌త్త వ‌హించాలి. అయితే కవలలతో గర్భం దాలిస్తే మెట్ల ఎక్కకుండా ఉండ‌డ‌మే మంచిది. అదేవిధంగా కళ్ళుతిరగడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు,  రక్త శ్రావం జరుగుతున్నప్పుడు, కు రక్త పోటు అధికంగా ఉంటే కూడా మెట్లు ఎక్క‌క‌పోతేనే మంచిది. సో.. జాగ్ర‌త్త‌గా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: