ఈ సృష్టిలో ప్రతీ మనిషికి ఒక ఇష్టం అనేది ఉంటుంది. ఇష్టం అనేది లేని వాడు అసలు మనిషే కాదు. ఆడాళ్ళు అయినా మగాళ్ళు అయినా సరే ఇష్టాల కోసం కాస్త త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు. అంత వరకు పెళ్లి అవక ముందు. పెళ్లి అయిన తర్వాత...? ప్రతీ ఇష్టానికి మరొకరి అభిప్రాయం అనేది చాలా అవసరం. ఉదాహరణకు నీకు ఒక వాహనం నచ్చింది. కాని ఆ వాహనం నీ భర్తకు నచ్చలేదు. దానిని కొనుగోలు చేసే సామర్ధ్యం అతనిది కాదు. అతని ఉద్యోగం, ఆర్ధిక పరిస్థితి చాలా ఉంటాయి. రూపాయి, రూపాయి ఆలోచించుకుని వ్యవహరిచాల్సి ఉంటుంది. 

 

కాని చాలా మంది తమ ఇష్టాల కోసం ఎదుటి వారికి విలువ ఇవ్వడం లేదు. ఆ వాహనం కావాలి, ఈ రోజు కాకపోతే రేపు అయినా నువ్వు దాన్ని కొనాలి. కొన్ని వాడివి నువ్వేం భర్త...? నీది అసలు మగతనమేనా...? అనే వరకు వెళ్ళారు కొందరు భార్యలు. నచ్చిన ఇంట్లో ఉండాలి. ఒక ఇల్లు నచ్చితే దాన్ని భర్త కొనాలి. వాడు అప్పే చేస్తాడో అడుక్కు తింటాడో అనవసరం. లేకపోతే ఉన్న ఇంట్లో సంతృప్తి ఉండదు. కబోర్డ్ సమస్య, బాత్ రూమ్ సమస్య, కిచెన్ సమస్య ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. 

 

కనీసం భర్త బాధలను కూడా అర్ధం చేసుకోవడం లేదు అనేది వాస్తవం. ఒకసారి ఏడు అడుగులు వేసిన తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య బలం అవ్వాలే గాని భారం అవకూడదు. మీ ఇష్టాలు, మీ కోరికలు అన్నీ కూడా భర్తకు బరువు అయిన రోజు మీరు సంసారం లో గాని కుటుంబంలో గాని ఎక్కడా సంతోషం వెతుక్కునే పరిస్థితి దాదాపుగా ఉండదు. ఇష్టం వచ్చినట్టు నాకు అది కావాలి ఇది కావాలి అంటూ మీ కోరికలను ఇష్టాలను భర్తల మీద రుద్దితే ఆర్ధికంగా చితికిపోవడమే కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. మానసికంగా ఒక్కసారి భర్తలో కుంగుబాటు మొదలయింది అంటే అది ఆగదు. కాబట్టి జాగ్రత్త అనేది అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: