ఆడాళ్ళకు అంటూ కొన్ని కోరికలు ఉంటాయి. పలానా డ్రెస్ వేసుకోవాలి అని, పలానా నగ వేసుకోవాలి అని, ఇలా ఏ విధంగా చూసినా సరే చిన్న చిన్న ఇష్టాలు కోరికలు సహజం. కాని నేడు కొందరు భర్తలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. భార్యకు పలానా వస్తువు మీద ఇష్టం ఉందీ అంటే ఆర్ధిక స్తోమత ఉండి కూడా కొనడం లేదు చాలా మంది భర్తలు. దీనితో తమ ఇష్టాలు చంపుకుని బ్రతుకుతున్నారు. మరి కొంత మందికి తమ కన్న వారిని చూడాలని, తమ కన్న వారితో మాట్లాడాలని ఉంటుంది. 

 

కాని వీటికి కూడా షరతులు పెడుతూ అంత అవసరం ఏముంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఆడవాళ్ళ మనస్తత్వం ఆధారంగా చూస్తే, ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ కి వెళ్తే, వేరే ఆడవాళ్ళు అందమైన చీర కట్టుకుంటే తనకు కూడా అలాంటి చీర కావాలి అని మనసు లాగుతూ ఉంటుంది. కాని దానికి మాత్రం భర్తలు ఆర్ధిక కారణాలను సాకు చూపించి అడ్డు పడుతూ ఉంటారు. ఏదైనా సినిమా చూడాలని అనిపించినా సరే ఇప్పుడు అవసరమా అని మాట్లాడతారు. చివరకు టీవీ చూసే విషయంలో కూడా భర్తలు భార్యలను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. 

 

గతంలో మాదిరిగా రోజులు లేవు. పెళ్లి అయిన తర్వాత కొన్ని కొన్ని పరిస్థితులకు అనుగుణంగా, సమాజానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. పలానా డ్రెస్ వేసుకోవడం నీ భార్యకు ఇష్టమా...? అలా కాదు ఇలా వేసుకో అని చెప్తే వచ్చే సమస్య ఉండదు. అంతే గాని అసలు ఆ కోరికనే చంపుకో అనేది సరైన విధానం కాదు. నిన్ను కాకపోతే పక్కింటి వాడ్ని అడగలేరు కదా..? కాబట్టి భార్యల ఇష్టానికి కూడా గౌరవం ఉండాలి. నీకు అభ్యంతరంగా ఉంటే ఇలా కాదు అని మార్చుకోవడం లేదా సున్నితంగా చెప్పడమే గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ప్రవర్తించడం అనేది భావ్యం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: