భార్యా, భర్తల మధ్య ఉండే సంబంధంలో ఏ లోటు ఉండకూడదు. కన్న తల్లి నీతో మహా అయితే 30 ఉంటుంది. కాని తాళి కట్టిన భర్త జీవితాంతం కలిసి నడవాలి, భార్య తో కలిసి జీవితాన్ని పంచుకోవాలి. ఒకరి ఇష్టాలను మరొకరు స్వేచ్చగా చెప్పుకోవాలి. ఒక ఆలోచనలను మరొకరు స్వేచ్చగా పంచుకోవాలి. కాని నేడు అలాంటి పరిస్థితి ఉందా...? నేటి వివాహ వ్యవస్థలో అలాంటివి మనం చూస్తున్నామా...? ఎక్కడో ఒక చోట మినహా పెద్దగా ఎక్కడా లేవు అనే చెప్పాలి. భార్య ఇష్టం వచ్చినట్టు భార్య ఉంటే, భర్త ఇష్టం వచ్చినట్టు భర్త ఉంటున్నాడు. 

 

ఏదైనా ఒక ఇష్టాన్ని స్వేచ్చగా పంచుకోలేని పరిస్థితి ఉంటుంది. చెప్తే ఆయన ఎం అంటాడో...? ఎలా రియాక్ట్ అవుతాడో...? చెప్తే ఎలాంటి గొడవ వస్తుందో...? అన్నీ ఆయనకే తెలియాల్సిన అవసరం లేదు. అన్నీ ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండవచ్చు. అంటూ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు గాని ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకోవడం అనేది ఎక్కడా లేదు. ఆయన వద్ద లిమిట్స్ లో ఉండాలి. ఆమెతో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి. అలా ఎందుకు అంటే... పెళ్లి అయిన రెండు నెలలకే గ్యాప్ వచ్చింది. 

 

హా వస్తే వచ్చింది ఏంటి...? గ్యాప్ వస్తే తాళి తెంపి వెళ్ళిపోయావా...? లేదా భార్యను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నావా...? ఒక మాట అనడం సహజం. నీ ఇష్టాన్ని భర్త కాదు అనడం సర్వ సాధారణం. మెచ్యురిటి లెవెల్స్ పెరిగి, మీ గురించి మీరు ఎక్కువ ఊహించుకుని, ఒకరిని ఒకరు తక్కువ చేసి చూడటం, గ్యాప్ అనే పేరుతో అసలు విషయాలను దాచుకుని బతకడం, చివరికి శృంగారం లో కూడా ఆలోచించి ప్రవర్తించడం అనేవి ఎక్కువైపోయాయి. అది లేని రోజు మీ జీవితం సంతోషంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: