ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అనేది ఎక్కువైపోయింది. దుస్తులు, అలంకరణ వంటి విషయాలలో కొత్త పోకడలు అనేవి ఎక్కువగా మనం చూస్తూ వస్తున్నాం. చాలా వరకు ఈ మధ్య పెళ్లి అయిన వాళ్ళు కూడా దీనికి బానిసలు గా మారుతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది మరింతగా ఎక్కువైపోయింది. ఎవరో మొహానికి ఏదో పెట్టుకుని కనపడితే, ఎవరో కొత్త దుస్తులను వేసుకుని కనపడితే దాన్ని చూసి నేను కూడా అలాగే ఉండాలి, నేను కూడా అలాగే రెడీ అవ్వాలి అంటూ కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. 

 

ఆన్లైన్ లో కావాల్సినవి దొరుకుతున్నాయి. దీనితో ఆడాళ్ళు ఫోన్ పట్టుకుని వాటి మీద ఎక్కువగా ఆధారపడటం మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ చూసి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక ఉద్యోగం చేసే సమయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎవరో ఏదో రకంగా బట్టలు వేసుకొస్తే అవి కొనడం, వాటిని వేసుకోవడం మనం చూస్తున్నాం. అక్కడి వరకు బాగానే ఉంది గాని పెళ్లి అయిన కొందరు ఆడవాళ్ళు స్కిన్ షో చేయడం అనేది ఎంత మాత్రం భావ్యం కాదు. భర్త వద్దని చెప్తే ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నారు. 

 

అత్యాచారాల్లో సగం ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కడం వలనే అవుతున్నాయి. ఎవరో హీరోయిన్ సోషల్ మీడియాలో హాట్ గా ఫోటో పెడితే దాన్ని చూసి నేను కూడా అలా వేసుకుని రోడ్డు మీద తిరగాలని భావించడం అనేది మంచి పద్ధతి కాదు. ఫ్యాషన్ అనేది భర్తకు, భార్యకు నచ్చి ఉండాలి. నచ్చకపోతే వదులుకోవాలి. అంతే గాని బలవంతంగా వేసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఇబ్బంది పడటం ఖాయం. ఇవి ఆత్మహత్యలకు కూడా దారి తీస్తాయి కాబట్టి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలి. అంతే గాని ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తే కట్టుకున్న వాడికి ఇచ్చే విలువ ఏముంటుంది...? రేపు మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే చేస్తున్నారు కదా...?

మరింత సమాచారం తెలుసుకోండి: