ఇటీవ‌ల కాలంలో టెక్నాల‌జీ కొంత‌పుంత‌లు తొక్కుతోంది. ఈ క్ర‌మంలోనే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు ఇలా అనేక ర‌కాల ప‌రికాలు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే వాస్తవానికి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటివి మానవ జీవితాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాయి. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తులనైనా కలుపుతోంది. కానీ అదే సమయంలో ఒకే గదిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను సైతం దూరం చేస్తోంది. ముఖ్యంగా భార్యాభ‌ర్త‌లు ప‌క్క‌ప‌క్క‌నే ఉన్నా.. ఎవ‌రి లోకంలో వారు బ్ర‌తుకుతున్నారు. అలాగే ఉద్యోగులు తమ భార్యకు ఇచ్చే సమయం కంటే స్మార్ట్ ఫోన్‌‌కే ఎక్కువ కేటాయిస్తున్నారు.

 

ఇలా చాలా మంది నిత్యం స్మార్ట్ ఫోన్‌కి పరిమితమై బంధాలను సైతం దూరం చేసుకుంటున్నారు. వాస్తవ సంభాషణలు పోయి, ఇప్పుడు వర్చు వల్ సంభాషణలు కొనసాగుతున్నయి. ఇలా ఆధునిక యుగంలో భార్యాభర్తల సంబంధాలు కూడా యాంత్రికంగా మారిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్రతి చిన్న విషయానికి అపార్థాలు, అలకలు, కోపాలు పెరిగి దాంపత్యంలో ప్రేమభావన, ఆత్మీయత తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి సమాజంలో అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తోంది. అలాగే మ‌రికొంద‌రు వ్యాపారాలు చేస్తూ.. పెళ్లాం, పిల్లల కంటే వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.

 

పెళ్లాం, పిల్లలు కంటే వ్యాపారమే ముఖ్యమని భావించేవారు.. డబ్బుతో ఏమైనా కొనగలరేమో కానీ సమయాన్ని మాత్రం కొనలేరని గుర్తుంచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వివాదాల‌కు కార‌ణం అవుతాయి. అయితే భార్యాభర్తలు తమ మధ్య అంతరిస్తున్న ఆనందాలకు, పెరిగి పోతున్న వివాదాలకు కారణాలు అన్వేషించుకుని తదనుగుణంగా తమ జీవనశైలిలో నూ పెను మార్పులు తీసుకు రాగలిగితే.. వారి జీవితం ఆనందభరితమవుతుందనటంలో సందేహం లేదు. ముఖ్యంగా భార్యాభర్త‌లిద్ద‌రూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప టాప్‌లు ప‌క్క‌న పెట్టి కాసేపు తమ తమ అభిప్రాయాలు పరస్పరం పంచుకోవటంతో పాటు ఎదుటివారు చెప్పేదానికి అంత విలువ ఇవ్వగలిగితేనే ప్రేమపూరిత సంబంధాలు బలంగా మార‌తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: