మనిషికి మోహం ఎక్కువ.. ధనం పట్ల మోహం.. వనిత పట్ల మోహం.. శరీరం పట్ల మోహం.. నిరంతరం వీటి వెనుక పరుగే జీవితంగా మారిపోయింది. ధనం, మందు, మగువ వీటి వెనుక పరుగులు తీస్తూ.. అసలు విషయాలు విస్మరిస్తున్నాడు.

 

 

తాను చేయాల్సిన కార్యాలు మర్చిపోతున్నాడు. ఈ విషయాన్ని సూక్ష్మంలో మోక్షంగా వివరించారు జగద్గురువు ఆది శంకరాచార్యులు. ఆయన చెప్పిన ఈ పోలిక చూడండి. "మానవశరీరం మట్టిప్రమిద.

 

 

ఆధ్యాత్మిక సాధన అనే చమురుతో హృదయమనే వత్తిని వెలిగించడం ద్వారా ఆ మట్టి ప్రమిద ప్రకాశిస్తుంది. అనేక రంధ్రాలున్న మట్టి కుండగా మానవశరీరాన్ని పోల్చిచెప్పారు జగద్గురువు ఆదిశంకరులు. ఇలా చెప్పడం వెనుక చాలా అంతరార్థం ఉంది. చిల్లుల కుండలో దీపాన్ని వెలిగిస్తే ఆ దీపకాంతి అన్ని వైపులా ప్రసరిస్తుంది.

 

 

మన శరీరంలోని ఆత్మజ్యోతి పంచేంద్రియాల ద్వారా ప్రకాశిస్తుంటే, జ్యోతి వెలుగుతో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి. దీపం ఎన్నో ఆశలకు ప్రతిరూపం. మనసులో జడత్వమనే చీకటి అలముకుంటే చైతన్యదీపాన్ని మనమే వెలిగించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: