దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎందుకంటే.. జ్ఞానానికి, సద్గుణానికి, సన్మార్గానికి, శ్రేయస్సుకు, వికాసానికి, పురోగతికి దీపం ఓ సింబల్. అగ్నికి ప్రతిరూపం ఈ దీపం. వెలుగు, వేడిమి అనేవి దీపం నుంచి వెలువడే శక్తులు.

 

వెలుగు చైతన్యదాయకం, వేడిమి జీవకళకు ప్రతీక. పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మహా అగ్ని ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ మహత్తరమైన వెలుగును లక్ష్మీదేవిగా దేవతలు ఆరాధించారు.

 

ఈ లోకంలో సమస్త సంపదలు వృద్ధిచెందడానికి ఆ వెలుగే ముఖ్ కారణం. అందుకే కాంతిని, రశ్మిని, దీప్తిని లక్ష్మికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే ఉదయం, సాయంత్రం సమయాల్లో దీపారాధనే చేస్తాం.. అగ్నికి పూజిస్తాం. కాంతి పథానికి, క్రాంతి రథానికి దీపమే ఇంధనం.

 

ఒక విషయం గమనించారా.. దీపం నూనెను స్వీకరిస్తుంది. వెలుగు పువ్వుల్ని మనకు ఇస్తుంది. నవ్యకాంతి కిరణాలతో దీపం నవ్వుతుంది. ఆ దీపాల వెలుగుల పరిమళాలు అందరి జీవితాల్నీ కాంతి వంతం చేస్తాయి. విశ్వమే ఓ దీపం అనుకుంటే.. ఆ విశ్వరశ్మే పరమాత్మ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: