నేటి మంచిమాట.. మనిషికి అందానివి అన్ని అందంగానూ.. అందినవి అన్ని అలుసుగాను కనిపిస్తాయి. ఈ వ్యాక్యం ఎవరు చెప్పారో సమాచారం లేదు కానీ.. నిజం చెప్పారు. అంతే.. మనుషుల బుద్ధి అలానే  ఉంటుంది. అందినది సరిపోదు.. అందనిది కావాలి.. ఇలా చాలామంది మనుషులు అందని దానికోసం పోరాడి పోరాడి నిరాశకు గురవుతారు. 

 

ఏ మనిషి అయినా ఉన్న దానితో సరిదిద్దుకొని.. అందిన దాంతో సంతృప్తి చెందితే.. ఉన్నదాన్ని అందంగా చూసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆలా కాదు అని.. మీ జీవితానికి ఎంతో దూరం ఉన్న.. సరిపోని వాటి గురించి ఆలోచించి.. అవి అందంగా ఉన్నాయి అని భ్రమ పడి.. అందిన వాటిని అలుసుగా చూస్తే మనిషి జీవితం దారుణంగా ఉంటుంది. 

 

ఇందుకు ఉదాహరణ.. ఈ కాలంలో ఎంతోమంది అబ్బాయిలు.. వారి భార్య విలువను తెలుసుకోలేక పోతున్నారు. భార్య అంటే చాలా చిన్నపు.. అందంగా లేదు అని అలుసు.. ఎందుకంటే? ఏ కష్టం లేకుండా.. కట్నం ఇచ్చి మరి ఇంటికి వచ్చింది కదా! అదే బయట భార్య కంటే వరస్ట్ గా ఉండే మహిళ కనిపిస్తే ఆమె నా లైఫ్ లో ఉంటె ఎంత బాగుండు అని.. అందంగా ఉన్న భార్యను అలుసుగా.. అందని అమ్మాయిని అందంగా చూస్తారు. ఇది నేటి సమాజం. జీవితం అంటే ఇలాగె ఉంటుంది మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: