అమ్మ అవ్వాల‌ని ప్ర‌తి మ‌హిళా కోరుకుంటుంది. తన ప్రాణం పోతున్నా మనకు ప్రాణం పోసి పదిలంగా ప్రపంచానికి పరిచయం చేసే దేవత అమ్మ. అమ్మ గురించి ఎన్ని చెప్పినా త‌క్కువే అనిపిస్తుంది. అమ్మ అంటే తొమ్మిది నెలల లెక్క కాదు...చిరకాల దీవెన. కడుపున పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవడం అమ్మ తత్వం. అయితే మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు. తల్లిగా మీరు తీసుకునే ఆహారం, మీరు పాటించే డైట్..ఇలా ప్రతి ఒక్కటీ కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ఆధారపడి ఉంటాయి. 

 

అయితే ప్ర‌గ్న‌న్సీ స‌మ‌యంలో ప్ర‌తి మ‌హిళ‌కు కొన్ని కామ‌న్ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రగ్నెన్సీ మహిళల్లో కనిపించే సాధారణ సమస్య తలనొప్పి. మీకు ఆకలి అయినప్పుడు లేదా మీ మూడ్ బాగోలేనప్పుడు తలనొప్పి వస్తుంది. దీన్ని మీరు కోపం రూపంలో ప్రదర్శిస్తారు. అలాంట‌ప్పుడు కొద్దిసేపు మెడిటేషన్ చేయడం, తలకు  మసాజ్ చేసుకోని రిలాక్స్ అవ్వాలి. సాధారణంగా గర్భవతుల ముఖం నల్లగా మారుతుంది. అధిక మోతాదులో ఈస్త్రోజన్ విడుదల దీనికి కారణం. 

 

మంచి విషయం ఏమిటంటే, కాన్పు తర్వాత మీ రంగు, ముఖవచస్సు తిరిగి వచేస్తాయి. అలాగే చాలా మంది గర్భవతులలో మార్నింగ్ సిక్‌నెస్ అనేది చాలా కామన్. వికారంగా ఉండటం, వాంతి వచ్చేలా ఉండటం, పైత్యం లాగా ఉండటం వంటివి గమనించవచ్చు. అలాంట‌ప్పుడు ఎక్కువగా పానీయాలు తీసుకోవడం పుల్లని పళ్ళ రసం తీసుకోవడం, అల్లం టీ తాగడం చేయాలి. మ‌రియు గ్యాస్ సమస్య. ఈ సమస్యతో ఎక్కువశాతం గర్భిని స్త్రీలు బాధపడుతుంటారు. అలాంట‌ప్పుడు  సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: