త‌ల్లి కావాల‌ని.. అమ్మ అని పిలిపించుకోవాల‌ని ప్ర‌తి మ‌హిళ‌కు ఉంటుంది. అలాగే ప్రెగ్న‌న్నీ స‌మ‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది. అయితే ప్రెగ్నన్సీ సమయంలో చాలామంది మహిళలు తమకు తెలిసో.. తెలియకనో కొన్ని తప్పులు చేయడం వలన వారితో పాటు వారికి పుట్టబోయే బిడ్డపైనా ప్రభావం చూపుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో మీకు ఇష్టమైన పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్స్ తినాలని ప్రతి ఒక్కరికీ కలగడం సహజమే, అందుకే అల్పాహారంగా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. 

 

కానీ ఒక 9 నెలల వరకు మీ బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేంత వరకు  వీటికి దూరంగా ఉంటేనే మంచిది. నీరు రోజులో ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే అంత మంచిదని, ముఖ్యంగా ప్రగ్నన్సీ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే గర్భిణీలకు వికారంగా ఉండటం వలన నీటిని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ, ప్రెగ్న‌న్సీ స‌మ‌యంలో ఎలా ఉన్నా ఖ‌చ్చితంగా నీటిని తీసుకోవాలి. అలాగే ప్రెగ్న‌న్సీ స‌మ‌యంలో చాలా మంది తెలియ‌కుండా కాఫీలు, టీ తాగేస్తుంటారు.

 

గర్భంతో ఉన్నప్పుడు కాఫీ తీసుకోవడం కడుపులో బిడ్డకు మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి బదులుగా ఆరోగ్యానికి మంచి చేసే గ్రీన్ టీ, లెమన్ టీ సేవించడం ఉత్తమం. ప్రెగ్నన్సీతో ఉన్న మహిళలు చేస్తున్న అతి పెద్ద తప్పులలో ఇదే మొదటిది. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ ఒకేసారి తినలేకపోవచ్చు. అందుకని రోజుకి కనీసం ఐదు సార్లు కొద్దిమొత్తంలోనైనా తీసుకోవాలి.  అంతేకాకుండా పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. సో.. బీకేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: