నేటి మంచిమాట.. ఈ క్షణం ఎలా ఉందో అలాగే స్వీకరించు.. ఈ మంచిమాట ఎవరు చెప్పిన బాగుంది. అవును.. ఈ క్షణంలో నువ్వు కోటీశ్వరుడు అయినా.. పేదవాడు అయినా.. గెలిచినా.. ఓడిన.. అవమానించిన.. పొగిడిన ఈ క్షణం ఎలా ఉన్న సరే దాన్ని స్వీకరించు.. అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది.. 

 

అలా కాదు అని.. పరీక్షలో ఫెయిల్ అయ్యావు అని.. ప్రేమలో విఫలమయ్యావు అని.. ఆస్తి పోయింది అని నువ్వు క్షణికావేశంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటే దాని బాధను భరించాల్సింది కూడా నువ్వే. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఆ క్షణం ఎంత ఘోరమైన సరే.. ఆ క్షణాన్ని ఎలా ఉన్న సరే స్వీకరించు.. 

 

ఇప్పుడు ఓడిపోయిన రేపు ఖచ్చితంగా గెలుస్తావు. ఈరోజు అవమానానికి గురైన రేపు ప్రశంసలు పొందుతావు.. ఈరోజు ఆస్తి పోయిన నీ తెలివితో రేపు ఆ ఆస్తిని రెట్టింపు సాధిస్తావు.. అలా కాదు అని ఈ క్షణం ఘోరంగా ఉంది అని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అది గమినించుకొని నిర్ణయం తీసుకుంటే జీవితం ఒక అద్భుతంలా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: