చాలా మంది విద్యార్థులు బాగానే చదువున్నప్పటికీ పరీక్షలు అనగానే కొంత టెన్షన్ పడాతారు. కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా విద్యార్థులు పరీక్షలలో సులభంగా మంచి మార్కులు తెచ్చుకొని విజయం సాధించవచ్చు. పరీక్షల్లో విజయం సాధించటానికి పరీక్షలకు కొన్ని నెలల ముందే టీవీ, సెల్ ఫోన్ లకు దూరంగా ఉండటం మంచిది. టీవీ, సెల్ ఫోన్ వలన విలువైన సమయం వృథా అవుతుందని గుర్తుంచుకోవాలి. 
 
పరీక్షలపై మనం ఎంత ఎక్కువ శ్రద్ధ పెడితే అంత ఎక్కువ మార్కులు వస్తాయని ఎంత తక్కువ శ్రద్ధ పెడితే అంత తక్కువ మార్కులు వస్తాయని గుర్తుంచుకోవాలి. చదివిన చదువును వీలైనంత వరకు ఇష్టపడి చదవాలే తప్ప కష్టపడి చదవకూడదు. రాత్రివేళల్లో ఎక్కువ సమయం మేలుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. రాత్రి సమయాళ్లో మేలుకోవడం కంటే ఉదయం సమయంలో త్వరగా నిద్ర లేవడం చాలా మంచిది. 
 
చదివిన వాటిని మననం చేసుకుంటే చదివినవి బాగా గుర్తుంటాయి. పరీక్షల సమయంలో ఒత్తిడి, టెన్షన్, అలసటకు పరిష్కారం ధ్యానం అని గుర్తుంచుకోవాలి. పరీక్షలు ఎప్పుడూ అద్భుతంగా రాస్తామని మనపై మనకు నమ్మకం ఉండాలి. అనవసర భయాలు పెట్టుకోకుండా పాజిటివ్ ఆలోచనలతో పరీక్షలకు వెళితే సులభంగా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: