ఆధునిక యుగంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి జీవితం ఆ ఒక్క పదం చుట్టూనే తిరుగుతుంది. నాకు ఏం లాభం.. నేను ఏం చేయాలి.. నాకు తెలియదా.. నాకు చెప్పావా.. నేను నీకు ఆ మేలు చేశాను.. నన్నే బెదిరిస్తావా.. నా సంగతి నీకు తెలుసా.. నన్ను మించిన తోపెవ్వడూ లేడు ఇక్కడ. ఇలా సాగుతుంది మన ఆలోచన.

 

 

అంతా నా అన్న పదం చుట్టూనే.. ఈ నా పదం చుట్టూనే అహంకారం పుడుతుంది. ప్రతి నిమిషం, ప్రతి విషయంలోనూ బయటపడి అడ్డుకునేది ‘అహం’. ‘నన్ను అడిగావా?’ అని నిలదీయడం, ‘నాకు తెలియదే!’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించడం... అదే అహంకారం!

 

 

అలాగని అహాన్ని వదిలేయమనడం లేదు. ఒకరికి తలవంచి నమస్కరించడం బానిసత్వానికి నిదర్శనం. కానీ.. ఒకరి గొప్పతనాన్ని బేషరతుగా ఒప్పుకొని శరణాగతి కోరడం భక్తి పరాకాష్ఠకు సంకేతం. అలా అహంకారాన్ని వదులుకోగలిగనప్పుడే మనసు ప్రశాంతమవుతుంది. భక్తికి ఆస్కారం ఏర్పడుతుంది. దాసోహం అన్న పదంలో అహం ఒక భాగం.

 

 

అహం అంటే నేను. నేను నీ దాసుణ్ని అని మనసా, వాచా చెప్పగలగాలి. అందుకు శ్రవణం, మననం, ధ్యానం భక్తియోగ సాధనకు కలిసివస్తాయి. వీటితో అంతులేని ప్రశాంతత. దాని ద్వారా అపరిమిత ఆనందం సాధ్యమవుతాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: