మాతృత్వం అనేది మాటకందని అనూభూతి. ప్రతి స్త్రీ ఆమె గర్భవతి అని తెలుసుకున్న క్షణం కలిగే ఆనందం ఆమెకే తెలుస్తుంది. ఇక అప్పటినుండీ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. క‌డుపులోని బ‌డ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ ఆమెకోసం మాత్రమే కాకుండా కడుపులో పెరిగే బిడ్డకోసం కూడా ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. తినే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొసారి గర్భం పొందినప్పుడు ఒక్కొ విధమైన లక్షణాలు కనబడుతాయి. అలాగే ఒక్క గర్భిణీస్త్రీకి మరో గర్భిణీ స్త్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 

 

లక్షణాల్లో కూడా చాలా తేడా ఉంటుంది. కాబట్టి గర్భం పొందిన మహిళలు గర్భధారణ సమయంలో హెల్తీగా మరియు హ్యాపిగా ముగియాలంటే కొన్ని హెల్త్ టిప్స్ కూడా పాటించాలి. అయితే  ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు మిస్ క్యారేజ్ జ‌రుగుతుంటుంది. అది కూడా ఇర‌వై వారాల లోపే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కడుపులోని బిడ్డకు ప్రమాదం కలిగించే కొన్ని విష‌యాల‌ను ప్రతి తల్లి తప్పక తెలుసుకోవాలి. రక్తస్రావం చిన్నగా మొదలై ఎక్కువ కావడం, జ్వరం, కడుపునొప్పి తీవ్రంగా ఉండటం మ‌రియు కడుపుచుట్టూ ఉన్న కండరాలు అధిక నొప్పి కలిగించడం వాటి వ‌ల్ల మిస్ క్యారేజ్ అవ్వ‌డం ఎక్కుగా జ‌రుగుతుంది. 

 

ఇటువంటి లక్షణాలు గుర్తులు గర్భంతో ఉన్నప్పుడు మీకు అనిపించినట్లయితే వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయండి. అలాగే ముఖ్యంగా హార్మోనుల అసమతుల్యత. అదుపులో లేని థైరాయిడ్ సమస్య, ప్రొజెస్టెరాన్ హార్మోన్ లోపం, పాలీసిస్టిక్ అండాశయాల వల్ల, హార్మోన్ సమస్యలతో కూడా మిస్ క్యారేట్‌ అయ్యే అవకాశం ఉంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: