పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు విద్యార్థులు కొంత టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ లో విద్యార్థులు కొన్ని పొరపాట్లు చేసి పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. విద్యార్థులు ఎల్లప్పుడూ పరీక్షల కోసం ఎంత చదివినా పరీక్షలో ఎలా ప్రజెంట్ చేశామనేదే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పరీక్షలు రాసే సమయంలో జవాబులను సూటిగా రాయాలి. పేపర్ దిద్దేవారిని ఇబ్బంది పెట్టే విధంగా పరీక్ష రాయకూడదు. 
 
పరీక్షలు వ్యాకరణ దోషాలు లేకుండా రాయాలి. జవాబు పత్రంలో లైన్లను గజిబిజిగా, గందరగోళంగా రాయకుండా ఒక్కో పేజీలో 16 నుండి 18 లైన్లు మాత్రమే వచ్చేలా రాయాలి. కొందరు విద్యార్థులు పరీక్షల్లో కలాన్ని వేళ్లతో బిగపట్టి పరీక్షలు రాస్తుంటారు. ఇలా రాయటం వలన జవాబు పత్రాలు గజిబిజిగా తయారవుతాయి. పరీక్షలు రాసే సమయంలో ప్రశ్నలను అర్థం చేసుకున్న తరువాతే జవాబులు రాయాలి. 
 
గణిత పరీక్షలో అంకెలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. జవాబు పత్రాలలో కొట్టివేతలు ఎక్కువగా ఉంటే మార్కులు తగ్గిస్తారని గుర్తుంచుకోవాలి. సమాధానాలు రాసే సమయంలో కంగారు పడకుండా అక్షరాలు స్పష్టంగా, గుండ్రంగా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చూసుకోవాలి. అక్షరానికి అక్షరానికి మధ్య గ్యాప్ ఉండకుండా పదానికి పదానికి మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: