నేటి మంచిమాట.. మనిషికి ఎంత ఆస్తి ఉన్న తినేది ఆహారం మాత్రమే.. అలాంటిది.. ఈరోజు ఆస్తి ఉంది అని నువ్వు పొగరు చూపిస్తే ఎలా? మనిషికి ఆహారం ముఖ్యం కానీ ఆస్తి కాదు. అది గుర్తుపెట్టుకొని ఏమైనా చేస్తే బాగుంటుంది. అలా కాదు అని.. నీకు ఉన్నదే ఆస్తి.. గోల్డెన్ స్పూన్ అని చెప్పి ఈరోజు విర్రవీగితే జీవినం చాలా కష్టంగా ఉంటుంది. 

 

నీకు ఆస్తి ఉంది అని ఎవరిని కించపరచకూడదు.. అవమానించకూడదు.. నీకు ఉన్న దాంట్లో కాస్త పేదలకు పెట్టాలి అని అనుకోవాలి కానీ... అవమానించకూడదు. తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే? పేదవాడు అయినా.. ధనవంతుడు అయినా తినేది ఆహారమే.. ఉన్నవాడు డబ్బుని తినలేడు.. లేనివాడు మట్టిని తినడు. 

 

అందరి ఆకలి తీర్చేది ఒక్క ఆహారమే. అది గుర్తుపెట్టుకొని మనుషులతో ప్రవర్తిస్తే బాగుంటుంది. మనిషికి విలువ ఇవ్వడం నేర్చుకోండి.. అవమానించడం కాదు. మనిషికి ఎంత ఆస్తి ఉన్న తినేది ఆహారమే.. మనిషికి ఎంత ఆస్తి ఉన్న మరణించాక అవసరం అయ్యే స్థలం ఆరు అడుగులే. మనిషికి మర్యాద, విలువ ఇవ్వండి.. పదికాలాల పాటు చల్లగా ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: