ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల విపరీత ఆలోచనల వలన విద్యార్థులు బాల్యం నుండి ఉద్యోగంలో స్థిరపడేవరకు విపరీతమైన టెన్షన్ ను ఎదుర్కొంటున్నారు. పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. చాలామంది బాగానే చదువుతున్నప్పటికీ పరీక్షల సమయంలో టెన్షన్ పడటం వలన చదువులో వెనుకపడిపోతున్నారు. ఎంత బాగా చదివినా పరీక్షల్లో మాత్రం సత్తా చాటలేకపోతున్నారు. 
 
పరీక్షల సమయంలో టెన్షన్ పడటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. రోజూ పాఠశాలకు వెళ్లి పరీక్షలు రాసినట్టే పబ్లిక్ పరీక్షలను కూడా టెన్షన్ పడకుండా రాయాలి. పరీక్షల సమయంలో చాలామంది మార్కులు తక్కువ వస్తాయనే టెన్షన్ తో నిద్రమేల్కొని చదువుతూ ఉంటారు. నిద్రమేల్కొని చదవటం వలన పరీక్షలలో మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. సరైన నిద్ర ఉంటే మాత్రమే ఏం చదివినా బాగా గుర్తుంటుందని గుర్తుంచుకోవాలి. 
 
విద్యార్థులు పరీక్షలకు సమయం తక్కువ ఉన్నా టెన్షన్ పడకుండా సరైన ప్రణాళికతో పరీక్షల సమయంలో స్వల్ప వ్యవధిని ఉపయోగించుకోవాలి. చదివే సబ్జెక్ట్ లో ఏవైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటూ కష్టమైన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. నెగటివ్ ఆలోచనల వలన టెన్షన్ ఏర్పడి అది ఆ తరువాత డిప్రెషన్ గా మారే ప్రమాదం ఉంది. అందువలన పరీక్షల సమయంలో టెన్షన్ పడకుండా మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం సొంతం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: