కరీంనగర్ కు చెందిన ఇద్దరు మిత్రులు పెళ్లికి ముందు దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టపట్టాలు వేసుకొని తెగ ఎంజాయ్ చేశారు. మంచి ఉద్యోగాలతో చేతి నిండా సంపాదిస్తున్న వీరిద్దరూ మందు విందులతో ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడిపారు. అయితే వారిరువురికి తమ 28 ఏట వారి వారి భార్యలతో పెళ్లి జరిగింది.

 

మొదటి వ్యక్తి యొక్క భార్య స్కూల్ టీచర్. ఇక మనవాడు భార్య స్కూల్ కి వెళ్ళగానే ఫ్రెండ్స్ తో పాటు పార్టీలు మందు విందు అంటూ సుఖజీవితం కొనసాగించాడు. ఇక రెండవ వ్యక్తి భార్య హౌస్ వైఫ్. మొగుడిని కొంగుకి ముడి వేసుకొని బయటకు పోనివ్వకుండా సంసార సుఖం అందిస్తూ మందు విందులకు దూరంగా భవసాగరంలో ముంచెత్తింది.రెండవ వ్యక్తి ఇంటి నుండి ఆఫీసుకు ఆఫీస్ నుండి ఇంటికి అంతే…. ఎప్పుడో వీకెండ్స్ లో కుటుంబంతో బయటికి వెళ్ళడమే కానీ మొదటి వ్యక్తి మాత్రం పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో అలాగే వ్యసనాలకు బానిస గా ఉన్నాడు.

 

కట్ చేస్తే మొదటి వ్యక్తి కి 33 ఏళ్లకే షుగర్ బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టాయి. రెండవ వ్యక్తి మాత్రం మాత్రం శారీరకంగా మరియు మానసికంగా చాలా ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నాడు. దీనిని బట్టి ఒంటరితనం లో గడపడం మరియు జీవిత భాగస్వామి ఎక్కువ సమయం తోడు లేకపోతే పురుషులు చెడిపోయి ఇలా అనారోగ్యాల బారిన పడుతున్నారని లండన్ పరిశోధకులు చేసిన తాజా సర్వేలో వెల్లడైంది.

 

భార్యతో సుఖవంతమైన జీవితం గడిపి ఆమె అదుపులో ఉన్న వారు ఆరోగ్యవంతంగా ఉన్నారని మరియు పెళ్లయ్యాక కూడా భార్య తన పని తాను చూసుకుంటూ ఉంటే మగాళ్ళు ఒత్తిడిని తట్టుకోలేక వ్యసనాల బారిన పడి తీవ్ర జబ్బులు తెచ్చుకుంటున్నారు అని చెబుతున్నారు. పెళ్లికి ముందు తర్వాత పురుషులపై అధ్యయనం చేసిన సంస్థ దాదాపు పది వేల మంది అభిప్రాయాలను సేకరించింది.

 

పెళ్లికి ముందు ఇష్టమొచ్చినట్లు ఎంజాయ్ చేసిన వారంతా పెళ్లి తర్వాత భార్య కంట్రోల్ లో ఉండి సెట్ రైట్ అయిపోయారు. అందుకే భార్య ఉద్యోగం చేస్తున్నా మొగుడు పెళ్ళాం అన్యోన్యంగా కలిసి ఉండి కాలం గడిపితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి అన్నది పరిశోధకుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: