లివ్ అంట్ లెట్ లివ్.. అంటే జీవించండి.. ఇతరులను బతకనివ్వండి.. జీవితాన్ని ఇంతకంటే సింపుల్ గా చెప్పే తత్వం ఇంకొకటి లేదు. దాన్ని కాస్త వివరించాలంటే.. ఈ పాయింట్లు గుర్తు పెట్టుకోండి. వాటిని పాటించండి. మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. అవేంటంటే.. మొదటిది.. పాపమయ్యేలా ఎప్పుడూ సంపాదించకండి. రెండోది.. అప్పులు అయ్యేలా ఖర్చుచేయకండి. అది జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. మూడోది.. అజీర్తి అయ్యేలా తినకండి. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. నాలుగోది.. మనస్పర్ధలొచ్చేలా మాట్లాడకండి.

 

ten points in life to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUCCESS' target='_blank' title='success-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>success</a> కోసం చిత్ర ఫలితం

 

ఐదోది.. ఆలస్యమయ్యేలా నడవకండి.. ఆరోది.. చితికి చేరేలా చింతించకండి.. ఏడోది..ఆలస్యం చేస్తూ కాలాన్ని నిందించ కండి.. ఏడోది.. అర్థం చేసుకోకుండా అవమానపర్చకండి. ఎనిమిదోది.. నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి..తొమ్మిదోది.. ద్వేషాన్ని వదిలేసి ప్రేమను మంచిస్నేహాన్నిఆహ్వానించండి.. పదోది.. ఇతరులు తక్కువ అనకుండా మనమే తక్కువ చేసుకోండి.. ఎందుకంటే.. కోపంగా 10 మాటలు కాదు ప్రేమగా ఒక్క మాట చాలు. ఇది అందరినీ మీకు చేరువ చేస్తుంది.

 

ten points in life to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUCCESS' target='_blank' title='success-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>success</a> కోసం చిత్ర ఫలితం

 

ముందు ఎంతున్నది కాదు వెనక ఎంత ఖ్యాతి ఉందో తెలియాలి.. ఎంత సీనియారిటి అన్నది కాదు.. ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం.. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు.ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం.. ఏమి సాధించామన్నది కాదు.. ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం.. ఎంత మంది స్నేహితులన్నది కాదు.. ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: