నేటి మంచిమాట.. ఎంత చేసిన కుటికే.. ఎన్నాళ్ళు చేసిన కాటికే.. కాదు అని ఎవరైనా అనగలరా? అనలేరు.. ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉన్నారు.. ఒకరు.. తిండి ఉన్న సరే తినడానికి సమయం లేనంత కష్టపడేవాళ్లు.. రెండు... తిండి లేక ఆకలితో చచ్చేవాళ్ళు. మనుషులకు కొందరికి అస్సలు అర్థం కాదు.. ఎన్నాళ్ళు చేసిన.. ఎంత చేసిన తినడానికి మాత్రమే అని.. 

 

అందుకే కొందరు.. ఎంత చేసిన కుటికే అనే విషయాన్నీ మర్చిపోయి అతిగా పని చేసి అనారోగ్యానికి గురవుతుంటారు.. మరికొందరు తిండి లేక ఆకలితో మరణిస్తున్నారు. మనిషి కష్టపడాలి.. ఆలా అని తిండి తిప్పలు మానేసి కష్టపడల్సిన అవసరం లేదు.. అవసరానికంటే ఎక్కువ కష్టపడిన పెద్దగా ఉపయోగం ఉండదు. 

 

మహా అయితే నీ ఇరు ముందు ఒక బిరుదు ఉంటుంది. కాబట్టి అవసరానికి మించినది ఏదైనా అనర్ధమే.. ఎంత చేసిన కుటికే.. ఎన్నాళ్ళు చేసిన కాటికే అనే విషయాన్నీ గుర్తించుకోండి. మీ జీవితంలో అన్ని రకాల ఆనందాలు చూడాలి అంటే.. ఖచ్చితంగా ఈ సామెతను ఫాలో అవ్వండి. అప్పుడే జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: