పిల్లలోని ఆటిజమ్, టొడ్లర్‌ సమస్యలను గుర్తించేందుకు వినియోగిస్తున్న టెస్ట్ M Chat R (మోడీఫైడ్‌ చెక్‌లిస్ట్‌ ఫర్‌ ఆటీజమ్‌ అండ్‌ టోడ్లర్‌, రివైజ్డ్‌). 16 నుంచి 30 నెలల వయసులోపల ఉన్న పిల్లలకు ఆటిజం సమస్య ఏమైనా ఉందా అని ఈ టెస్ట్ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ఈ టెస్ట్‌ను డయానా రాబిన్స్‌ ఇన్వెంట్ చేయటం జరిగింది. అప్పటి నుంచి ఈ టెస్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ కోసం వాడుతున్నారు. ఆటీజమ్‌తో పాటు ఇతర న్యూరలాజికల్‌ సమస్య ఏదైనా సరే మూడేళ్ల లోపూ చేసే ఇంటర్వెన్షన్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌.

 

ఆ ఇంటర్వెన్సన్‌కి ఎం చాట్‌ ఆర్‌ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా పిల్లల బిహేవియర్‌, అటెన్షన్‌, కాంగ్నిటీ లెవల్స్‌ గురించి అంచనా వేస్తారు. ఈ టెస్ట్‌లో భాగంగా తల్లిదండ్రులను పిల్లలకు సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. వచ్చిన స్కోర్‌ను బట్టి వారి పరిస్థితి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లాంటి తదుపరి చర్యలు తీసుకుంటారు. అయితే చెక్‌ లిస్ట్‌ ఆథరైజ్డ్‌ పర్సన్‌ మాత్రమే చేయాలి. చెక్‌ లిస్ట్‌ లో ఉన్న ప్రశ్నల విషయంలో కూడా కొన్ని నిబంధలు ఉన్నాయి. అవన్ని సరిగ్గా అనుసరించగలిగిన డాక్టర్స్‌ను మాత్రమే సంప్రదించాలి.


చెక్‌ లిస్ట్ లో వచ్చిన స్కోరు 0 నుంచి 2 వరకు అయితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదుగాని, 3 నుంచి 7 మధ్య వచ్చినట్టుగా గానీ లేదా 8 నుంచి 20 మధ్య వచ్చినట్టుగా గానీ గుర్తిస్తే వెంటనే నెక్ట్స్‌ లెవల్‌ టెస్ట్‌కు వెళ్లి, క్లియర్‌గా చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఎర్లీ ఇంటర్వెన్షన్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ అలా అన్నింటికీ ఎంతో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: