మనం ఆరోగ్యంతో ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. దీనిలోని పోషకాలు శరీరానికి అందాలంటే ఆహారం సరిగా జీర్ణం కావాలి. ఇది జీర్ణం కావాలంటే బాగా నమిలి తినాలి. ఇందుకు దంతాలు బలంగా ఉండాలి. అంటే మన ఆరోగ్యానికీ దంతాలకూ ఇంతటి కీలక సంబంధం ఉందన్నమాట. ఇక మన దేశంలో దాదాపు అధిక శాతం మందికి పంటి ఆరోగ్యం పట్ల అస్సలు శ్రద్ధ ఉండదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత పేరుకు బ్రష్ చేసేసే అలవాటే ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇది మినహా ఎక్కువ శాతం ప్రజలకు పంటి ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు.

 

ఇక సాధార‌ణంగా ఉదయం నిద్రలేవగానే.. బ్రష్‌ పట్టుకుని బాత్‌రూంలోకి వెళ్తాం. అందుబాటులో ఉన్న లేదా టివీ ప్రకటల్లో నచ్చిన పేస్ట్‌ను వాడి..దంతాలు మెరుస్తున్నయా ? లేదా అని అద్దంలో చూసుకుంటాం. అలాగే కొంద‌రు బ్రెష్  నిండా పేస్ట్ పెట్టిసి తెగ తోమేస్తుంటారు. అయితే ఇది అంత మంచిది కాదని అంటున్నారు వైద్యులు. పేస్టూ బ్రష్ నిండా ఉంటే లేనిపోని రోగాలు వస్తాయని అంటున్నారు. పేస్టూ అవసరమే గాని అతి అవసరం లేదని అంటున్నారు. 

 

టూత్‌ పేస్టులలో పాలీ ఇథైలిన్‌ ఉంటుంది. ఈ రసాయనం శరీరానికి విషపదార్థం మాదిరిగా భావించాలి. దీని కారణంగా మూత్రపిండాలు, మెదడు సమస్యలు వస్తాయట. సోడియం లారిల్‌ సల్ఫేట్‌ను టూత్‌పేస్టు తయారీలో కూడా వాడతారు. వీటి వలన నోట్లో అల్సర్‌లు, చర్మ సమస్యతో పాటు హార్మోన్లలో అసమానతలు కూడా తలెత్తుతాయి. అయితే  రోజుకి ఓ బఠాణి గింజంత పరిమాణంలో మాత్రమే పేస్టుని ఉపయోగించాలి. దాన్ని కూడా శుభ్రంగా బ్రష్‌తో రాయాలి. ఇలా చేయడం వల్ల పళ్లు బాగా శుభ్రం అవ్వ‌డ‌మేగాక‌.. ఎలాంటి సమస్యలు ఉండ‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: