పోటీ పరీక్షల్లో, నిత్య జీవితంలో గణితానికి ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. కొందరు విద్యార్థులు గణితంలో అద్భుతాలు సృష్టిస్తున్నా మరికొందరు మాత్రం గణితం అంటే భయపడుతున్నారు. విద్యార్థులు గణితం అంటే భయం పోయినపుడే ఏ శాస్త్రంలోనైనా రాణించగలుగుతారని గుర్తుంచుకోవాలి. విద్యార్థులు గణితం అంటే ఆసక్తిని ఏర్పరచుకోవాలి. గణితం సులభమైనది. 
 
గణితాన్ని ఎల్లప్పుడూ అర్థం చేసుకునే తీరు, విశ్లేషించే సామర్థ్యం వలనే గణితంపై ఆసక్తి ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి. మౌఖిక గణితం అభ్యాసం చేయడం ద్వారా విద్యార్థులు సులభంగా గణితంపై ఉండే భయాన్ని పోగొట్టుకోవచ్చు. గణితం అంటే భయపడకుండా సాధన చేయాలి. గణితంపై అభిమానం పెంపొందించుకుంటే గణితం చాలా తేలిక అనిపిస్తుంది. అబాకస్, రూబిక్స్ వంటి పరికరాలు ఉపయోగించటం వలన గణితం సులభంగా అర్థమవుతుంది. 
 
విద్యార్థులు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధన చేస్తే గణితం సులువుగా బుర్రకెక్కుతుంది. కొన్ని గణిత ప్రక్రియలు, సూత్రాలను నేర్చుకుంటే ఎంతో కష్టం అనిపించే గణితం సులువుగా అర్థమవుతుంది. గణిత సమస్యలను నిత్య జీవిత సన్నివేశాలతో అనుసంధానం చేసుకుంటూ అభ్యాసం చేయాలి. బుర్రకు పదును పెట్టే పజిల్స్, సుడోకులాంటివి ప్రాక్టీస్ చేయడం వలన గణితం అంటే భయం పోగొట్టుకుని సులభంగా గణితంలో మంచి మార్కులు పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: