సాధార‌ణంగా ఇంట్లోనే కూర్చిని వ‌ర్క్ చేసేవాళ్ల ప‌ని చాలా బెట‌ర్ అనుకుంటారు. కానీ, ఈ విధంగా ప‌ని చేసేవాళ్లు ఎక్కువ సమయం పనికి కేటాయిస్తారు దాంతో తెలియకుండానే అలసిపోతారు. ఇక ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఏ పని చేయాలన్న కంప్యూటరే దిక్కు. అందుకే ఇంట్లోవారైనా.. ఆఫీస్‌వారైనా కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలే  ఉంటున్నాయి. ఇలా వీరు రోజులో దాదాపు 8 నుండి 10 గంటల సమయం కూర్చొని పని చేయటంలోనే సరిపోతుంది. ఈ రకంగా రోజులో దీర్ఘకాలం కూర్చుని పనిచేసేవారికి అతి త్వరగా ఊబకాయం, దీనితో పాటు డయాబెటీస్ వచ్చే అవకాశం వుందంటున్నారు పోషకాహార నిపుణులు.

 

అయితే చిన్నచిన్న మార్పుల ద్వారా వీటిని ఎదుర్కోవచ్చు, తద్వారా ఇంటి నుంచి చేసే ఉద్యోగాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. కంప్యూటర్ తో పనిచేయాల్సి ఉంటే తప్పకుండా ఒక కుర్చీ కొనుక్కోవడం మరవొద్దు. కూర్చునే భంగిమ బ్యాక్ పెయిన్‌కు కారణమవుతుంది. దీన్ని నివారించడానికి సరైన సపోర్ట్ ఇచ్చే కుర్చీని అమర్చుకోవాలి. ఇంట్లో ఉండి పనిచేసేవారు సాధారణంగా రాత్రుళ్లు ఎక్కువసమయం కంప్యూటర్ల మీద గడిపేస్తూంటారు. 

 

ఇది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. కాబ‌ట్టి.. ఎంత వ‌ర్క్ ఉన్నా స‌రే ఆరోగ్యానికి ప్రేయార్టి ఇచ్చి స‌మ‌యానికి నిద్ర‌పోవాలి. అలాగే ఏకధాటిగ గంటలు గంటలు పనిచేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కనీసం గంటకోసారి లేచి ఇంటిచుట్టూ ఒక రౌండ్ వేయడం అస్స‌లు మరవొద్దు. అలా రౌంట్ వేసేట‌ప్పుడు ఒక గ్లాస్ మంచినీరు తాగ‌డం కూడా చాలా ముఖ్యం. ఇక లాస్ట్ బ‌ట్ నాట్ లీస్ట్‌.. ఎప్పుడూ కూడా మంచం మీద ల్యాప్‌టాప్ పెట్టుకుని వ‌ర్క్ చేయ‌కూడ‌దు. ఇది కేవలం మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా మానసికంగా ప్రభావితం అయ్యేలా చేస్తుంది. 

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: