నేటి మంచిమాట.. మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది.. అవును.. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు లోకం అంత మంచిగా కనిపించి ఆనందపడుతావు.. అదే చెడుగా ఆలోచిస్తే.. నీకు లోకం అంత చెడ్డగానే కనిపిస్తుంది.. చెడు కనిపించినప్పుడు నీకు ఆనందం ఎక్కడ వస్తుంది? 

 

మనం చూసే విధానంలోనే మంచి అయినా చెడు అయినా కనిపిస్తాయి.. మనం అందరిలో మంచి చూశాము అంటే మనకు ఏ బాధ ఉండదు.. అందరిని చిరు నవ్వుతో పలకరిస్తావు.. నిన్ను అందరూ చిరునవ్వుతో పలకరిస్తారు.. అలా కాదు అని.. కోపంతో.. విరక్తితో.. విసిగించుకుంటూ ఉంటె నిజంగా మంచివాళ్ళు కూడా నీకు చెడుగా కనిపించి బాధను తెప్పిస్తారు..

 

మనం ఆనందంగా ఉండాలి అంటే మన పక్కన వాళ్ళు కూడా ఆనందంగా ఉండేలా చూసుకోవాలి.. వాళ్ళు ఆనందంగా ఉండాలి అని నువ్వు ఏదో వాళ్ళ కష్టాలు అన్ని భరించాల్సిన తీర్చాల్సిన అవసరం లేదు.. వాళ్ళతో మాట్లాడిన అంతసేపు ఆనందంగా మాట్లాడిస్తే చాలు వాళ్ళ భాద తిరి కాసేఫు అయినా ఆనందంగా ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: