సాధార‌ణంగా ప‌సి పిల్ల‌లు ఇంట్లో పారాడుతూ, బోసి న‌వ్వులు కురిపిస్తూ ఉంటే ఆ సంద‌డే వేరు. ఇక బిడ్డ పుట్టిన తరువాత మొదటి నెల నుంచి ఒక సంవత్సరం నిండే వరకు మనం ఇచ్చే ఆహారం వారి ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తుంది. అలాగే ప‌సి పిల్ల‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండ‌లి. ఆరోగ్యపరంగా, వైద్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్ల‌ల‌కు భ‌విష్య‌త్తులో నాడీ సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే వారిని చిన్న వ‌య‌స్సులో బాగా నిద్ర‌పోయేలా చేయాలి. దీంతో వారు ఎదుగుతున్న కొద్దీ మెద‌డు ప‌రంగా స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అదే సమయంలో శిశువుకు కొంత రిలాక్సేషన్ కూడా కావాలి. అందుకు కొంద‌రు ప‌సి పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకువెళ్తుంటారు. 

 

అయితే పాపకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కనుక బయటకు తీసుకెడితే ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఏదైనా వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన రెండు నెలల వరకూ బిడ్డను బయటికి తీసుకెళ్లక పోవడమే మంచిదని కొందరంటారు. కొందరు మరేం ఫరవాలేదని చెబుతున్నారు. ఏదేమైనా ప‌సి పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకువెళ్లేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు అయితే తీసుకోవాలి. ఎక్కువ చల్లగా లేదా ఎక్కువ వేడి వాతావరణం ఉన్న చోటికి బిడ్డను తీసుకెళ్లకూడదు. విపరీత వాతావరణ పరిస్థితుల్ని ఆ బిడ్డ లేత చర్మం తట్టుకోలేదు. 

 

అలాగే బేబీకి వేసే దుస్తులు కూడా అనువుగా ఉండాలి. మందంగా, బిగుతుగా ఉండే ఎక్కువ బట్టలు వేయకూడదు. అందువల్ల చెమట పడుతుంది. దీంతో పిల్ల‌ల‌కు చికాకు పెడుతుంది.  అలాగని అసలు బట్టలు లేకుండా ఉంచకూడదు. బయటి వాతావరణం వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా ఆ ప్రభావం పాపమీద పడుతుంది. వేడి ఎక్కువైతే చర్మం బొబ్బలెక్కి మంట పుడుతుంది. చల్లగా ఉంటే జలుబు చేస్తుంది. సో.. వాతావ‌ర‌ణం బ‌ట్టీ పిల్ల‌ల‌కు దుస్తులు వేయాలి. మ‌రియు బిడ్డకు వేడి తగలకుండా.. ముఖ్యంగా ఎండ వేడి పడకుండా చూసుకోవాలి. సూర్యరశ్మి కానీ, వేడి కానీ తగిలితే..భవిష్యత్తులో స్కిన్ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సో.. బీకేర్‌ఫుల్..!

మరింత సమాచారం తెలుసుకోండి: