నేను చాలా ఆనందంగా ఉన్నాను.. అన్ని విషయాల్లో పూర్తి సంతృప్తితో ఉన్నాను.. నాకు ఇక ఎలాంటి కోరికలూ లేవు.. ఈ మాటలు చెప్పే మనిషి మీకు చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించాడా.. అంటే సమాధానం లేదు అనే వస్తుంది. ఎందుకంటే.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. ఎంత కోటీశ్వరుడైనా ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటాడు.

 

 

అయితే మరి నిజంగా సంతోషంగా ఎప్పుడు ఉంటాం మనం.. ఇది చాలా చిక్కుప్రశ్నే. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.. పంచభూతాల్లో ఒకటైన నీరు ద్రవ రూపంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ అది కొన్నిసార్లు మంచుగడ్డగా కూడా మారుతుంది. హిమశిఖరం అలాంటి మంచుతో ఏర్పడిందే.

 

 

కానీ ఆ మంచు పర్వతం దప్పికతోఅలమటించే వారికి ఉపయోగపడలేదు. అది దాహం తీర్చాలంటే.. ఘనస్థితి నుంచి ద్రవంలోకి మారాల్సిందే. అలా మారడమే స్వేచ్ఛ. ఒక్క నీరే కాదు.. పంచ భూతాలన్నీ స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్లే అవి మనకు ఉపయోగపడాలన్న తపనతో ఉంటాయి.

 

 

మరి మనిషి.. అస్తమానం ప్రాపంచిక విషయాలతో ముడివడ్డ మనసుతో మనిషి బందీ అయ్యాడు. ప్రశాంతతను కోల్పోయి ఆనందానికి దూరమయ్యాడు. మళ్లీ ఆనందం దరిచేరాలంటే మనిషి మనసు నిజమైన స్వేచ్ఛ పొందాలి. అందుకు ఏకైక మార్గం ఆధ్యాత్మికతను సమీపించడమే.. ఇదే అన్ని బాధలకూ పరిష్కారం.

మరింత సమాచారం తెలుసుకోండి: