మగ పిల్లలకు జన్యత పురుషాంగం చివరి భాగాన్ని కప్పుతు పడగవలె వదులుగా అధిక చర్మం వుంటుంది. ఇది ముందు వెనుకలకు పురుషాంగం పై కప్పుతుంది. సుంతి శస్త్ర చికిత్సలో ఈ వదులుగా అధికంగా ఉన్న చర్మాన్ని తొలగిస్తారు. దీనితో పురుషాంగం చివర భాగం బయటపడుతుంది. ఈ శస్త్ర చికిత్స మగబిడ్డ పుట్టిన 48 గంటలలో చేయడం ఉత్తమం కానీ సాధారణంగా మొదటి 10 రోజులోపల చేయిస్తూ వుంటారు. బిడ్డ పెరిగే కొద్దీ ఇది క్లిష్టమయిపోతుంది. నెలలు నిండాక ముందే పుట్టిన పిల్లలకు మరియు ఇతర సమస్యలతో పుట్టిన పిల్లలకు ఇది ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళే వరకు సాధారణంగా చేయరు.

 

పురుషాంగం లోపాలతో పుట్టిన పిల్లలలో ఈ శస్త్ర చికిత్స చేయరు. ఎందుకంటే లోపాలు సరి చేసే శస్త్ర చికిత్సలో ఈ అధిక చర్మం ఉపయోగపడవచ్చు. సుంతి జరిగిన పిదప పురుషాంగం గురించి తీసుకొనవలసిన జాగ్రత్తలు ప్రతిసారీ స్నానాంతరం సబ్బు గోరు వెచ్చని నీటితో శుభ్రపరచాలి. సుంతీ శస్త్ర చికిత్స తరువాత బిడ్డకు కొంత ఆ ప్రాంతంలో కొంత అసౌకర్యంగా ఉంటుంది. శుభ్రపరిచేటప్పుడు కొంత సున్నితంగా పట్టుకోవాలి. సాధారణంగా పుండు మానడానికి, 7 నుంచి 10 రోజులు పడుతుంది. అంత వరకు మొన పచ్చిగా, పసుపురంగులో ఉంటుంది.

 

పరిసరాల అంటు వ్యాధుల నుంచి  పురుషాంగంకు రక్షణ ఇస్తుంది. ఒకవేళ పురుషాంగం మొదటి పై భాగం చర్మం ఉంచితే దాని వలన  అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. సున్తీ చేయించడం వలన అంటూ వ్యాధులకు దూరంగా ఉంటారు. పురుషులకు యవ్వన దశలో చాలా అంటూ వ్యాధులకు గురి అవుతారు. దానిలో ముఖ్యంగా పురుషాంగం కు సోకే వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. మూత్రం వలన  అంటువ్యాధులు సంక్రమణ. 

 

చాలా అధ్యయనాల ప్రకారం సున్తీ చేయించని బాలురు మూత్రం  అంటువ్యాధులకు గురి అవుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం 39రెట్లు సున్తీ చేయబడని వారు  మూత్రం అంటు వ్యాధులకు గురి అవుతున్నారు.. ఇంకా కొన్ని అధ్యయనాల ప్రకారం పది రెట్లు ఎక్కువగానే అంటు వ్యాధులకు గురి అవుతున్నారు. బాలురు సున్తీ చేయించుకోనేవారు మూత్ర అంటు వ్యాధులకు గురి అవుతున్నారు. అయితే సున్తీ చేయించుకున్న బాలురుల్లో  కూడా అంటు వ్యాధులకు గురి కాగ‌లరు.

 

మూత్ర అంటు వ్యాధులు కొన్ని సందర్భాలలో  ఘోరమైన అనారోగ్యానికి గురి చేస్తుంది. ప్రొఫెసర్ వైస్ వెల్ అధ్యయనాల ప్రకారం 36% బాలురుల్లో 88 బాలురులు మూత్ర అంటువ్యాధులకు గురి అవుతున్నారు.  అదే బ్యాక్టీరియా వారి రక్తంలో కూడా కనుగొనబడింది. అందులో ముగ్గురు పిల్ల‌లు  నాడీ మండల శోధతో ఇబ్బంది పడుతున్నారు. మరో ఇద్దరు మూత్ర పిండాల వైఫల్యం తో  భాధపడుతున్నారు. మిగతా ఇద్దరు శరీరంలో సూక్ష్మజీవులు వ్యాపించి మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: