రొమాంటిక్ జంట సందు దొరికినప్పుడల్లా ఎక్కడో ఒక చోట టచ్ చేసుకుంటూనే ఉంటారు. అటువంటి జంటను చూస్తే ఇతరులకు ఈర్ష్య కూడా కలుగుతుంది. ఒక రోజులో జంట అలా టచ్ చేసుకుంటే, వాటిలో 8- 12 మత్తులోకి తీసుకెళతాయని అంటున్నారుు. శరీరంలో ఏ ప్రదేశమైనా కావచ్చు. ముఖం దగ్గరనుంచి పాదాలవరకూ ఎక్కడ టచ్ చేసినా మనసు జివ్వున లాగేస్తుందట. అయితే అన్ని టచ్‌లు ఒకలా ఉండవని కూడా అంటున్నారు. ముఖ్యంగా మనసులో రొమాంటిక్ ఆలోచనలు కలిగినప్పుడు చేసే టచ్‌లో తేడా ఉంటుందని చెబుతున్నారు. స్పర్శలోని ఆనందం భాగస్వామి మనసుని రొమాంటిక్ మూడ్‌లోకి తెస్తుంది. దాంతో భాగస్వామి నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తుంది.

 

నుదుటిపై సున్నితంగా చేసే పెదవుల స్పర్శ జీవిత భాగస్వామిని తియ్యటి అనుభూతిలోకి తీసుకుని వెళ్తుంది. అయితే ఇది ముద్దు కాదు. సుతారంగా పెదవులతో నుదుటిని స్పర్శించడం మాత్రమే.  ముద్దు మత్తులోకి జారుకున్న తర్వాత పెట్టేది. పెదవులతో అంటీ ముట్టనట్లుగా స్పర్శించడం ఇది. పక్కపక్కన కూర్చున్నప్పుడు భాగస్వామి చేయిని తన ఒడిలోకి తీసుకోవడం ప్రేమకు సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుంది. అది అప్రయత్నంగా జరిగినట్లు ఉండాలి. దానివల్ల జీవత భాగస్వామిలో మీ పట్ల ఇష్టం పెరుగుతుంది. అది తర్వాతి క్రియకు మార్గం వేస్తుంది. ఆ అనుభూతితో భాగస్వామి ఆనందానుభూతుల్లో తేలియాడుతారు.

 

జీవిత భాగస్వామి పెదవులను సుతారంగా చేతితో స్పర్శించడం వల్ల ఎంతో మధురాభూతి చెందుతారు. అధి మీకు మీ జీవిత భాగస్వామి పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంది. తర్వాతి లైంగిక క్రీడను ఉర్రూతలూగిస్తుంది. ప్రేమతో కూడిన ఇటువంటి స్పర్శ దాంపత్య జీవితాన్ని కూడా సుఖమయం చేస్తుంది. మెడపై చేయి వేసి మెల్లగా వీపు మీద స్పర్శించి, ఆ తర్వాత చాతీపై సుతిమెత్తగా స్పర్శించాలి. ఇది స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుంది. పురుషుడైతే ఆమె కటి భాగాన్ని స్పర్శిస్తే మహిళ ఎక్కడ లేని మధురానుభూతికి లోనవుతుంది. నడుము పొరలను స్పర్శించవచ్చు. భాగస్వామి కాళ్లను కాళ్లతో రాస్తూ అప్పుడప్పుడు అవతలి కాలిపై ప్రేమతో ఒత్తిడి పెంచాలి. భుజాలు, నడుము వంటి కొన్ని శరీర భాగాలను తాకుతున్నట్లుగా కూర్చోవడం ఎంతో హాయిని, ఆహ్లాదాన్ని పంచుతాయి. ఒకరి పట్ల మరొకరి ఇష్టాన్ని తెలియజేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: