నేటి మంచిమాట ఓటమిని ఓడించడానికి కావలసింది దైర్యం కాదు ఓర్పు.. అని అనుకుంటాం కానీ ఈ ఓర్పు చాలామందిలో ఉండదు. నిజానికి మన భాగస్వాములకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఓర్పు ఉండదు.. ఒక్క తల్లికి మాత్రమే మనం ఏం చేసిన ఓర్చుకొని అలా కాదు ఇలా అని నేర్పిస్తుంది. జీవితం అంటే ఇది అని పరిచయం చేస్తుంది. 

 

ఇప్పుడు అమ్మ ప్రేమ గురించి.. అమ్మ ఓర్పు గురించి చెప్పడం మనం పక్కన పెడితే.. మన ఓటమిని ఓడించడానికి మనకు చాలా ఓర్పు ఉండాలి.. ఎన్ని సార్లు ప్రయత్నించినా సరే కొన్ని కొన్ని సార్లు మన దురదృష్టం వల్ల మళ్లీ మళ్లీ ఓడిపోతుంటాం. అలాంటి సమయంలో కేవలం దైర్యం ఉంటే సరిపోదు.. గెలిచే వరుకు ఓడిపోయినా పర్లేదు అని కోపంను అదుపులో పెట్టుకునే శక్తి.. ఓర్పు మీలో ఉండాలి.  

 

ఇంకా నిజం చెప్పాలి అంటే.. సీరియల్ లో నటించే హీరోయిన్ కి ఉండే అంత ఓర్పు ఉండాలి. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా పడతారు.. ఎంతమంది మోసం చేసిన క్షమిస్తారు.. విధి ఆడే వింత నాటకంలో వారికి ఎంత అన్యాయం జరిగినా సరే దేవుడు ఉన్నాడు అని అంటారు ఆ సీరియల్ హీరోయిన్స్. అలా మనం కూడా ఏదైనా సాధించాలి అంటే అది ఓర్పుతోనే సాధ్యం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: