తెలంగాణ రాష్ట్రంలో రేపటినుండి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతి ఉండదు. విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. రాష్ట్రంలో అనేక ప్రవేశ పరీక్షలకు అధికారులు ఒక నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 
 
దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు ఐపీఈ సెంటర్ లొకేటర్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రాలను సులభంగా తెలుసుకోవచ్చు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి స్లిప్‌లు తీసుకువచ్చినా, పేపర్లు మార్చుకున్నా, చూచి రాతలకు పాల్పడినా సీసీ కెమెరాలు వారిని పట్టించే అవకాశం ఉంది. తప్పు చేసిన విద్యార్థులపై అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తారు. 
 
విద్యార్థులు పరీక్షల సమయంలో ప్రాక్టీస్, పునశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యమైన చాప్టర్లు, గత ప్రశ్న పత్రాల ఆధారంగా ప్రధాన టాపిక్స్ పై ఫోకస్ పెట్టాలి. రాని అంశాల జోలికి వెళ్లకుండా... వచ్చిన అంశాలపై మరింత పట్టు సాధించేలా కృషి చేయాలి. రివిజన్ సమయంలో వ్యాసరూప ప్రశ్నలకు, ఉదాహరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సులభంగా ఉండే చాప్టర్లను ముందుగా పూర్తి చేసి... ఆ తర్వాత క్లిష్టమైన చాప్టర్లకు సమయం కేటాయించాలి. ఈ సూచనలు పాటిస్తే పరీక్షల్లో సులభంగా మంచి మార్కులు సాధించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: