నిన్న గడిచిపోయింది.. దాని లెక్క అయిపోయింది. ఇక దాంతో పని లేదు అనుకుంటారు చాలా మంది.. నిన్న అంటే గతం.. రేపు అంటే భవిష్యత్తు.. ఈ రెండు వేరు వేరే అయినా గతాన్ని బట్టే మన భవిష్యత్ ఉంటుంది. నిన్న మీరు మంచి చేస్తేనే రేపటికి అది మీకు కలసి వస్తుంది.

 

 

గతం అంటే.. జరిగిపోయిన కాలం. అది అనేకానేక జ్ఞాపకాలుగా మన మనసులో చరిత్రగా పుస్తకాల్లో నిలిచిపోతుంది. భవిష్యత్‌ కాలమంటే రాబోయేది. ప్రస్తుతానికి ఇంకా రాలేదు. కానీ.. రావడానికి సిద్ధంగా ఉంటుంది. అయినా సరే.. రేపు అనే దానికి రూపం లేదని అంటుంటారు.

 

 

గతంలో మనం చేపట్టిన పని బాగా చెయ్యడం వల్ల అది.. భవిష్యత్తుగా మారుతుంది. ఆ కారణంగానే గతంలోని స్వప్నం భవిష్యత్తులో సాకారమవుతుంది. అందుకే కలాం లాంటి వారు కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.

 

 

అదే మీరు గతంలో చేసిన పొరపాట్లే రేపటికి ప్రతిబంధకాలుగా మారతాయి. అందుకే ఏ పని చేపట్టినా దీర్ఘకాలంలో దాని ఫలితాలేంటనేది అంచనా వేసుకోవాలి. ఈరోజు అయిపోతుందని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే.. గతమనేది పెట్టుబడి లాంటిదైతే, భవిష్యత్తు రాబడి వంటిది. అందుకే నభూతో న భవిష్యతి అంటారు. గతం లేకపోతే భవిష్యత్‌ లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: