అవును. నిజంగానే మీ చుట్టూ చాలా మంది హీరోలున్నారు. మనం ఇన్స్పిరేషన్ గా తీసుకునేందుకు తగినంత మంది మన చుటూనే ఉన్నారు. అదేంటి నేనెప్పుడూ గుర్తించలేదే అంటారా.. అవును.. ఎప్పుడూ సముద్రగర్భంలో తిరిగే చేపలకు.. తన చుట్టూ ఉన్నవి రత్నాలని.. అవి చాలా విలువైనవని తెలియదు.

 

 

అలాగే మన చుట్టూ ఉండే వారికి.. మనం దూరం అయ్యే వరకు మన విలువ ఏంటో వారికి తెలియదు. కొన్ని బంధాలకు పేరు పెట్టలేము.. కొన్ని బంధాలు పేరు మాత్రమే ఉంటాయి.

కోపం మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి.. ప్రేమ మాటల్లోనే కాదు మనసులో కూడా ఉండాలి.

 

 

ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా... లేక పనిచేసినా... ఎప్పటికీ అతనిని వదలని నీడలాగా... ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు... విలువ ఇవ్వని బంధాలకు... అబద్ధాలాడే అనుబంధాలకు... మౌనంగా దూరం కావడమే మంచి మార్గం.

 

 

అలాగే మన చుట్టూ ఉన్న వారి విలువ తెలుసుకుని తగిన గౌరవం ఇస్తే.. వాళ్లూ మనల్ని గుర్తిస్తారు. మంచిని మన చుట్టూ పెంచుకుందాం.. మంచిగా ఆనందంగా జీవిద్దాం. ఏమంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: