ఒక వైపు ప్రపంచం అంతా కరోనా కలకలంతో కొట్టుమిట్టాడుతోంది. దేశదేశాలలో కరోనా భాదితులు ఎక్కువై పోతున్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కోరోనా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఇప్పటికి అమెరికాలో సుమారు 6 మంది కరోనా భారిన పడి ప్రాణాలు విడిచిపెట్టారు.  నేపధ్యంలో కరోనా వైరస్ పుట్టిన చైనా లో ఓ నర్సు నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ప్రభుత్వానికి ఓ లేఖని రాసింది. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది..

IHG

పూహాన్ నగరాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ఇప్పటికే ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటే మరెంతోమంది భాదితులు వైద్య సాయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఓ నర్సు నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ చైనా ప్రభుత్వానికి లేఖని సంధించింది. అంతేకాదు ఇప్పుడు కరోన హడావిడిలో ఉన్నాం కాబట్టి కరోనా వ్యాధి తగ్గినా తరువాతే బాయ్ ఫ్రెండ్ ని పురమాయించండి అంటూ సూచించింది కూడా..

IHG

తన కోరికని వ్యక్త పరుస్తూ ఓ సందేశంతో కూడిన లేఖని చూపిస్తూ హ్యాజ్ మ్యాట్ సూట్ లో కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని మరీ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అది కాస్తా వైరల్ అవడంతో అందుకు వివరణ కూడా ఇచ్చింది. అందరూ కరోనా వైరస్ భయంతో ఉండిపోయారు. మంచి రోజులు మనకి వస్తాయి అనే ఆశాభావాన్ని ప్రజలలో కలిగించడానికి ప్రభుత్వానికి ఇలా లేఖని రాశానని చెప్పుకొచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: