ఒకప్పుడు త‌ల్లి పాత్ర ఎలా ఉండేదంటే ఇంట్లో పిల్ల‌లు, భ‌ర్త, వంట మంచి చెడులు కుటుంబం, అత్త‌గారు మామ‌గారు అంటూ పెద్ద‌వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్ప‌టి త‌రం త‌ల్లులు ఇటు ఇంట్లో అటు బ‌య‌ట ప‌నులు అన్నీ చ‌క్క‌బెట్టేస్తున్నారు. నేటి త‌ల్లులు మెట్రోఅమ్మ‌ల్లా త‌యార‌య్యారు అంత ఫాస్ట్‌గా ఉంటున్నారు. ఉద‌యం లేవ‌డం ఇంటి ప‌నిని చ‌క్క‌బెట్ట‌డం, పిల్ల‌ల‌ను, భ‌ర్త‌ను, చూడ‌టం అలాగే బ‌య‌ట‌కు వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో భ‌ర్త‌ల‌కు వేడినీళ్ళ‌కు చ‌న్నీళ్ళు లాగా కుటుంబానికి ఆర్ధికంగా సంపాదించి పెడుతున్నారు. మ‌రి ఇంత క‌ష్ట‌ప‌డుతూ కుటుంబం కోసం అస్స‌లు ఒక్క క్ష‌ణం కూడా తీరిక లేకుండా ఉద‌యం లేస్తే తిరిగి మ‌ళ్ళీ రాత్రి పడుకునేవర‌కు కూడా విశ్రాంతి తీసుకునే స‌మ‌యం ఉండ‌దు.

 

అయినా కూడా ఏ రోజూ విసుగు చెంద‌కుండా త‌ల్లి త‌న బాధ్య‌త‌ల‌న్నిటినీ కూడా ఎంతో సక్ర‌మంగా నిర్వ‌ర్తిస్తూ ఉంటుంది. అందుకే అంద‌రూ మెట్రో అమ్మ నువు సూప‌ర్ అమ్మ అంటున్నారు. ఇంకొంత మంది ఇళ్ళ‌ల్లో అయితే ఈ మ‌ధ్య కాలంలో సంపాద‌న విష‌యంలో కూడా ఆడ‌వారిదే పై చేయి ఉంటుంది. అంటే తండ్రి సంపాదించిన దానికంటే కూడా త‌ల్లి ఎక్కువ సంపాదిస్తూ పిల్ల‌ల ప‌ట్ల త‌న కున్న బాధ్య‌త‌ను పూర్తి చేస్తుంది. మ‌రి ఇంత క‌ష్ట‌ప‌డినా కూడా ఒక్కో సారి ఆ ఇంట్లో ఆ త‌ల్లికి దొరికే గౌర‌వం కొన్ని ఇళ్ళ‌ల్లో దొర‌క‌డం లేదు.

 

అలాగే తండ్రి బిజీగా ఆఫీస్ ప‌నుల్లో ఉంటే త‌ల్లే ఆఫీసు నుంచి వ‌స్తూ ... వ‌స్తూ... ఇంట్లో కావ‌ల‌సిన ప్ర‌తి వ‌స్తువును తెచ్చుకుంటుంది. అలాగే ఫోన్‌బిల్‌, క‌రెంట్ బిల్ ఇలా ఒక్క‌ప‌నేంటి ప్ర‌తి ప‌నిలోనూ భ‌ర్త‌తోపాటు భార్య స‌మానంగా ప‌నులను పంచుకుంటూ ఎంతో చ‌క్క‌గా త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తుంది. అంటే ఒక‌ప్ప‌టి త‌ల్లికి ఇలాంటి బాధ్య‌త‌లు ఏవీ ఉండేవి కావు. అవ‌న్నీ చాలా త‌క్కువ మంది చేసేవారు కానీ ప్ర‌స్తుతం రోజులు మారాయి. టెక్నాల‌జీ పెరిగింది. దీంతో అంద‌రూ చ‌దువుకోవ‌డం వ‌ల్ల ఇద్ద‌రూ ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో ఇంట్లో అమ్మ‌కి ఎక్కువ బాధ్య‌త ప‌డుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: