ఒక‌ప్పుడు భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ ఒక్క మాట‌మీద ఉండేవారు. భార్య భ‌ర్త అడుగుజాడ‌ల్లో న‌డిచేది. అప్ప‌డు ప్ర‌తి కుటుంబం ఉమ్మ‌డి కుటుంబంలా ఉండేవారు.  అంద‌రూ క‌లిసి ఉండ‌డంతో మంచి చెడులు తెలిసేవి. పెద్ద‌వారు చెపిన‌ట్లే ప్ర‌తిఒక్క‌రూ కుటుంబంలో న‌డుచుకునేవారు.పెద్ద‌వా్ళ‌కి అంత గౌర‌వం ఇచ్చేవారు.కానీ నేటి త‌రానికి అలాంటిదేమీ లేదు. అంతేకాక ఇప్పుడు పెళ్ళైన నెల రోజుల్లోనే వేరు కాపురం పెడుతున్నారు. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య ఏమైనా చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చినప్ప‌టికీ  ఎవ‌రూ స‌ర్ది చెప్పేవారు ఉండ‌డం లేదు. దాంతో కొన్ని గొడ‌వ‌లు ఏకంగా భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ విడిపోయేంత వ‌ర‌కు వ‌స్తున్నాయి.

 

ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్ జ‌న‌రేష‌న్ అయిపోయింది. ఏ నిర్ణ‌య‌మైన సొంతంగా ఆలోచించుకుని క్ష‌ణాల్లో నిర్ణ‌యాన్ని తీసేసుకుంటున్నారు. దాని వ‌ల్ల ఎన్నో కుటుంబాలు అన‌వ‌స‌రంగా పాడైపోతున్నాయి. భార్యాభ‌ర్త‌లు ప్రేమ‌, కుటుంబ విలువ‌లు ఇప్ప‌టి త‌రానికి ఇవేమి తెలియ‌డం లేదు. ఎంత‌కీ కొన్ని ఇగో ఫీలింగ్స్ వ‌ల్ల వారి మాటే నెగ్గాల‌నుకునే త‌త్వం త‌ప్పించి వేరే ఏమీ క‌నిపించ‌డం లేదు.

 

మ‌రి ఇలాంటి సంద‌ర్భాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల‌ని అంటున్నారు. తొంద‌ర‌పాటు అస్స‌లే ప‌నికిరాదు. ఒక‌సారి పెళ్ళైతే ఇద్ద‌రూ కూడా ఎంతో ఎంతో ఓర్పుగా నేర్ప‌రిత‌నంతో ఉండాలి. అలాగే ఒక‌రి ఆలోచ‌న‌ల‌ను మ‌రొక‌రు గౌర‌వించుకోవాలి. అంతే త‌ప్పించి ఏదో తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దు. ఇప్ప‌టి త‌రానికి తొంద‌ర‌పాటు త‌ప్పించి ఆలోచ‌న విచ‌క్ష‌ణ అనేది ఉండ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: