భార్యాభ‌ర్త‌ల సంసార బాధ్య‌త‌లు ఎలా ఉండాలంటే...కేవ‌లం ఇంట్లో త‌మ పిల్ల‌లు త‌మ కుటుంబం వ‌ర‌కూ చూసుకుంటుంటారు. అయితే సంసారం అంటే కేవ‌లం త‌ల్లితండ్రి ఇద్ద‌రు పిల్ల‌లు మాత్ర‌మే కాదు.  ఈరోజుల్లో చాలా మంది విడిగా ఉంటున్నారు. ఉమ్మ‌డి కుటుంబాల్లో ఉండ‌డం లేదు. దాంతో ఆ న‌లుగు మాత్ర‌మే త‌మ కుటుంబంగా భావిస్తున్నారు. దీంతో ర‌క్త‌సంబంధాలు, బంధాలు అనుబంధాలు అన్న‌వి ఎవ‌రికీ తెలియ‌డం లేదు.  అంతేకాక చాలా మంది త‌ల్లిదండ్రులు సంసార బాధ్య‌త‌లు అంటే కేవ‌లం డ‌బ్బులు సంపాదించడం మాత్ర‌మే అని అనుకుంటున్నారు. కానీ పిల్ల‌లు ఎలా ఉంటున్నారు. ఏంటి అన్న‌ది మాత్రం ఎవ్వ‌రికీ తెలియ‌డం లేదు. 

 

కేవ‌లం డబ్బు సంపాద‌న ఒక్క‌టే కాదు సంసార బాధ్య‌త‌లు అంటే కేవ‌లం పిల్ల‌ల‌ను చూసుకోవ‌డం వారి మంచిచెడులు అంతేకాక త‌మ‌తో పాటు వారి నాయ‌న‌మ్మ‌, తాత‌య్య‌లు ఇలా ఎవ‌రైతే పెద్ద‌వాళ్ళు మ‌న‌తో ఉంటారో వాళ్ళని కూడా చూడాల‌ని చెప్పి పిల్ల‌ల‌కు నేర్పించాలి. అలాగే మంచి చెడుల గురించి తెల‌పాలి. ఎంత సేప‌టికి మ‌న జీవితం మ‌న‌దే అనుకుంటే త‌ర్వాత జ‌న‌రేష‌న్‌లో కూడా మ‌న ప‌రిస్థితి కూడా అలానే అవుతుంది అన్న విష‌యం గుర్తుంచుకోవాలి. కాబ‌ట్టి పెద్ద‌ల‌కు గౌర‌వం ఇవ్వాలి. వాళ్ళ‌ని కుదిరినంత వ‌ర‌కు ప్రేమ‌గా బాధ్య‌త‌గా చూసుకోవాలి. ఇవ‌న్నీ మ‌నం చేయ‌డం వ‌ల్ల మ‌న పిల్ల‌ల‌కు అల‌వాటు అవుతుంది. అలాగే మ‌న ఇంట్లో వాతావ‌ర‌ణం బ‌ట్టే పిల్ల‌లు కూడా పెరుగుతారు. అస‌లు సంసార బాధ్య‌త‌లు అంటే ఇవ‌న్నీ కూడా వ‌స్తాయి. త‌ల్లిదండ్రుల‌ను చూడ‌టం కూడా ఒక బాధ్య‌తే... కానీ ఈ విష‌యాన్ని చాలా మంది గ‌మ‌నించ‌రు.  

మరింత సమాచారం తెలుసుకోండి: