సాధార‌ణంగా చిన్నా పెద్దా అని తేడా లేకుండా బిస్కెట్స్‌ను తిన‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట‌ప‌డుతుంటారు. ప్ర‌స్తుతం మార్కెట్‌లో అనేక ర‌కాల బిస్కెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఖాళీగా ఉన్న‌ప్పుడో.. ఆక‌లిగా ఉన్న‌ప్పుడో.. టీవీ చూస్తున్న‌ప్పుడో.. ఇలా ఏదో ఒక‌ సంద‌ర్భంలో కొంద‌రు ప్ర‌తిరోజు బిస్కెట్స్‌ను తింటుంటారు. అలాగే మ‌రికొంద‌రికి ఉదయం టీ సేవనంతో మొదలయ్యే బిస్కట్... జీవితంలో ప్రధాన భాగంగా మారిపోతుంది. అయితే అస‌లు బిస్కట్ అంటే అసలు అర్థం తెలుసా! లాటిన్‌లో ‘బిస్’ అంటే రెండుసార్లు అని, ‘కిట్’ అంటే ఉడికించడం అని అర్థం. 

 

అయితే బిస్కెట్లు తింటే బుర్ర పనిచేయ‌దు అని మీకు తెలుసా..? అవును! బిస్కెట్స్ తింటే మైండ్ ప‌నిచేయ‌ద‌ని ప‌రిశోధ‌కులు కూడా తేల్చారు. ఇందులో భాగంగానే.. అదేపనిగా బిస్కెట్లు, కేకులు తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందంటున్నారు. దీనికి కారణం బిస్కెట్లు, కేకులు తయారు చేసే సమయంలో బిస్కట్లు కరకరలాడేందుకు , కేకులకు మంచి సువాసన వచ్చేందుకు వాడే ట్రాన్స్‌ఫ్యాట్స్ అనే కొన్ని రకాల కొవ్వు పదార్థాలే. అంతేకాకుండా, వీటి త‌యారీలో హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై చెడుప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

 

ఇక ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోయే ప్రమాదం, హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయ‌ని తెలుస్తోంది. అయితే ఆకలి వేసినపుడు ఒకటి రెండు బిస్కెట్లు తింటే ఎలాంటి ప్రాభావం చూప‌దు. అలా కాకుండా రెండు, మూడు ప్యాకెట్లు బిస్కెట్స్ తింటే తిప్ప‌లు తిప్పువు. మ‌రియు వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు శరీరంలో ఎక్కువ కాలరీలు వచ్చి చేరతాయి. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: