అనుభవించు రాజా... అనుభవించు రాజా.. అంటూ ఓ సినిమా పాట ఉంది కదా.. అది అక్షరాలా నిజం.. చాలా మంది భవిష్యత్ పై బెంగతో ఉంటారు. మరికొందరు గతాన్ని తలచుకుని కుమిలిపోతుంటారు. కానీ నిన్న మళ్లీ రానే రాదు.. దాని గురించి ఆలోచించి వేస్ట్..

 

 

ఇక రేపంటారా.. అది ఎలా ఉంటుందో తెలియదు.. ఎన్ని కరోనా వైరస్ లు మన భవిష్యత్ పై పొంచి ఉన్నాయో తెలియదు. ఇక మన చేతిలో ఉన్నదల్లా వర్తమానం మాత్రమే. అందుకే ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయాలి. గతం అంటే, జరిగిపోయిన కాలం. అది అనేకానేక జ్ఞాపకాల సమాహారంగా మనసులో, చరిత్రగా పుస్తకాల్లో నిలిచిపోతుంది.

 

 

భవిష్యత్‌ కాలమంటే రాబోయేది. ప్రస్తుతానికి ఇంకా రాలేదు. రేపటి దానికి రూపం లేదని అంటారు. మరి ఇక ఉన్నదేమిటి? తాజాగా ఉండే వర్తమానం. విశ్వంలో భూత, భవిష్యత్తులకు చోటు లేదు. అది నిరంతరం వర్తమానంలో ఉంటుంది. మనిషి భూత, భవిష్యత్తులలో కాలం వెళ్ళదీస్తాడు గతం తలచుకుని చింతిస్తాడు.

 

 

రాబోయే భవిష్యత్‌ గురించి అనవసరమైన ఆందోళన చెందుతాడు. వర్తమానంలో చాలా తక్కువ జీవిస్తాడు. అందుకే.. ఈరోజే జీవించండి. రేపు రాదన్నంతగా ఈరోజును అనుభవించండి.. అప్పుడు మీకు ఇక చింతే ఉండదు. నిత్యం ఆనందమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: