ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. ఒక్కో వింత ఒక్కో సంఘటన నుంచీ పుట్టుకొస్తుంది. అయితే సహజసిద్ధంగా జరగవలసిన, సృష్టికి అనుగుణంగా నడవాల్సిన కొన్ని క్రమ పద్దతులు జరిగితే అదో పెద్ద వింతే. ఒక జాతి పునరుత్పత్తి జరగాలంటే తప్పకుండా ఆ జాతి యొక్క మగ, ఆడ కలిస్తేనే జరిగుతుంది. మరేరకంగా కూడా పునరుత్పత్తి జరిగే అవకాశమే లేదు..కానీ

IHG

ఒక పురుష తోడు లేకుండానే ఓ బల్లి జాతికి చెందిన ఆడ సరీసృపం ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని టెన్నెసీలో జరిగిన ఈ సంఘటన శాస్త్రవేత్తలని సైతం నోళ్ళు వెళ్ళబెట్టేలా చేసింది. అమెరికాలోని టెన్నెసీలోని ఒక జూ లో చార్లీ అనే ఓ కొమోడే అంటే డ్రాగన్ బల్లి జాతి కొంత కాలంగా ఉంటోంది. జూ సిబ్బంది దాని సంతానాన్ని వృద్ది చేసే క్రమంలో దాని బోనులో దాని జాతికి చెందిన మగ బల్లిని విడిచి పెట్టారు..అయితే

IHG

ఆ పురుష జీవితో కలవడానికి ఇష్టపడని చార్లీ దానిపై దాడి చేయడంతో జూ సిబ్బంది మగ బల్లిని అక్కడి నుంచీ వేరు చేశారు. అయితే కొన్ని నెలల  తరువాత చార్లీ ముగ్గురు పిల్లలకి జన్మని ఇచ్చింది. దాంతో ఖంగుతిన్న జూ క్యూరేటర్ వెంటనే చార్లీ కి పరీక్షలు చేయించారు. ఈ టెస్ట్ లలో మగ జీవితో సంపర్కం జరగకుండానే చార్లీ పిల్లలు కనిందని తెలుసుకుని షాక్ అయ్యారు. శాస్త్రవేత్తలు సైతం ఈ విషయంపై మొదట్లో ఆశ్చర్యం వ్యక్తం చేసినా కొన్ని ఆకసేరుకాల్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: