మాతృత్వం ఆడజన్మకు ఓ వరం అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. అమ్మతనం కోసం వివాహం అయిన ప్ర‌తి స్త్రీ తపిస్తుంది. ఇక గర్భవతి అని తెలిసిన క్షణం నుంచీ పుట్టబోయే బిడ్డ గూర్చి ఎన్నో కలలు కంటుంది. మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే మాతృత్వం స్త్రీకు పునర్జన్మ లాంటిది. ప్రతి తల్లి మంచి తెలివితేటలు, బలం మరియు మంచి ఆరోగ్యం ఉన్న తన బిడ్డ పుట్టాలని అనుకుంటుంది. ప్రతి అమ్మాయి తాను ప్రసవించడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్నప్పుడు శిశువు ఆరోగ్యం గురించి అన్ని విధాలుగా శ్రద్ధ వహించడం ప్రారంభిస్తుంది.

 

ఇక ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాళ్ళ వాపులు రావడం సహజమే. శరీరం ఉబ్బినట్లుగా ఉండటం, చేతులు, ముఖం కూడా ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పాదాల వాపు ఎక్కువగా మూడవ నెల నుండి మొదలవుతుంది. కొందరిలో ఏడు, ఎనిమిదవ నెలలలోనూ ఈ విధంగా ఉంటుంది. అయితే గర్భంతో ఉన్నప్పుడు కాళ్ళ వాపును ఆరోగ్య నిపుణులు ఎడిమా అని అంటారు. సాధారణంగా ఈ సమయంలో గ‌ర్భ‌వ‌తులు నీరు ఎక్కువగా తీసుకోవడం అవసరం. ఇలా తీసుకున్న నీటిని మొత్తం శరీరం గ్రహించడం వల్ల‌ పిండం అభివృద్ధికి కాస్త కష్టమవుతుంది.

 

ఇటువంటప్పుడు కడుపులోని బిడ్డ  ఆ నీటిలో అటు ఇటు తిరగడం జరుగుతూ ఉంటుంది. ఈ నీరే కిందకు కాళ్లకు చేరి పాదాల వాపుకు కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక ప్రగ్నన్సీ సమయంలో కాళ్ళు వాపు, శరీరం ఉబ్బినట్లు అధికంగా ఉంటే ఊపిరి  తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శరీరం అలసిపోయినట్లు ఉంటుంది. అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండటం వలన హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబ‌ట్టి, వీల‌నంత వ‌ర‌కూ పాదాల వాపును త‌గ్గించుకోవ‌డం చాలా మంచిది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: