మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు పరీక్షలు మొదలుకానున్నాయి. చాలామంది విద్యార్థులు కష్టపడుతున్నా ఎగ్జామ్ పాస్ కాలేమేమో, సరిగ్గా రాయలేమేమో అనే భయంతో ఆందోళన పడుతున్నారు. కొందరు పరీక్షలు రాయకముందే భయపడుతూ ఒత్తిడికి లోనవుతుంటే మరికొందరు ఫలితాలు రాకముందే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు అన్ని విషయాలను అర్థమయ్యేలా వివరిస్తూ వారిలో అనవసర భయాలు తొలగిస్తే పిల్లలు భయాలను అధిగమించి విజయాన్ని సొంతం చేసుకుంటారు. 
 
తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలని... ఉన్నత స్థానాలకు ఎదగాలని... పెద్ద ఉద్యోగం చేయాలని కోరుకోవడంతో తప్పు లేదు. ప్రస్తుతం కొందరు తల్లిదండ్రులు పిల్లల చదువుకోసమే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పోటీ ప్రపంచంలో అతి వేగం ఉంటేనే బతకగలమనే సూత్రాన్ని నూరిపోస్తూ వారు ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలు పలు సందర్భాల్లో అనవసర భయాలతో కుంగిపోతున్నారు. 
 
మరోవైపు విద్యాసంస్థలు ర్యాంకులు, మార్కుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. పిల్లలను తోటి పిల్లలతో పోలిస్తే వారు మానసికంగా కృంగిపోతారు. తల్లిదండ్రులు పిల్లల్లో ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని కల్పిస్తూ వారికి భరోసా ఇవ్వాలి. పిల్లలకు తెలియని విషయాలు చెప్పి వారికి తల్లిదండ్రులు ఎల్లవేళలా తోడుగా ఉంటారనే నమ్మకాన్ని కల్పించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: