ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది చెడు అలవాట్లకు బానిసలై తన కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. యువత వీలైనంత త్వరగా చెడు అలవాట్లకు దూరం కావడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. సమయం మించిపోయేదాకా చెడు అలవాట్లకు దూరం కాకపోతే అవే మన విజయానికి అడ్డంకులు అవుతాయి. విద్యార్థులు, యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగితే సులువుగా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. 
 
చెడు అలవాట్లకు బానిసలై ఏదైనా అనుకోని ఘటన జరిగితే మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా బాధ పడాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. చెడు అలవాట్లను అలవరచుకున్న వారిలో నేర ప్రవృత్తి, హింసా ప్రవృత్తి పెరిగే అవకాశం ఉందని పలు సర్వేల్లో తేలింది. యువతలో చాలా మంది మొబైల్, ఇంటర్నెట్ అతి వినియోగం వల్ల ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ మంచి అవకాశాలను కోల్పోతున్నారు. 
 
జీవితంలో ఎల్లప్పుడూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటే లక్ష్యాలను సులభంగా సాధించుకోవచ్చు. వీలైనంత వరకు చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మంచిది. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు మనకు తెలియకుండానే మన జీవితాలను నాశనం చేస్తాయి. చెడు అలవాట్ల వల్ల కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. కొందరు చెడు అలవాట్లకు బానిసలై ప్రాణాంతక వ్యాధుల భారీన పడుతున్నారు. అందువల్ల జీవితంలో ఏ సందర్భంలోను చెడు అలవాట్లను అలవరచుకోకపోతే ఎంచుకున్న లక్ష్యాలను సాధించి విజయం సొంతం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: