పాపం కొత్త జంట‌లు..! పెళ్లిమాత్రం అయింది కానీ.. ఓ ముద్దూ లేదు.. ముచ్చ‌ట లేదు..! ఎదురెదురుగా ఉన్నా.. ఏం లాభం..! దూరంగానే ఉంటూ భారంగా గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి..! కౌగిలింత‌లు లేవు.. గిలిగింత‌లు అంత‌క‌న్నాలేవు.. అయ్య‌య్యో..! జీవితంలో తొలిరేయి హాయి క‌రువైపోతోందే..! రెండు మ‌న‌సులు ఒక్క‌టై మాట‌ల‌ను జుర్రుకునే అవ‌కాశం లేకుండా పోతుందే..! ఇలా విర‌హ‌వేద‌న‌తో ర‌గిలిపోతున్న కొత్త‌జంట‌ల క‌ష్టాల‌కు కార‌ణం ఏమిట‌ని అనుకుంటున్నారా.. ?  మ‌రేమీ లేదండీ.. అంతా క‌రోనా మాయే!  క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌మే స్తంభించిపోతోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌పంచ‌దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్య‌క‌లాపాలు ఆగిపోతున్నాయి. ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశాయి. స్టాక్‌మార్కట్లు ఆగ‌మాగం అవుతున్నాయి.  ఈ క్ర‌మంలోనే కరోనా వైర‌స్ క‌ష్టాలు నూత‌న జంట‌ల‌కూ మొద‌ల‌య్యాయి. తాజాగా, వివాహాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. జ‌న‌స‌మూహం క‌లిసే అవ‌కాశం ఉన్న కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని పెళ్లీలు జ‌రిగిపోగా.. కొత్త‌జంట‌ల‌ తొలిరాత్రికి కూడా క‌రోనా దెబ్బ‌ప‌డింది. ఇప్పుడొద్దు బాబోయ్‌.. త‌ర్వాత చూసుకుందాంలే అంటూ కొన్ని జంట‌లు త‌మ హానీమూన్ ట్రిప్‌ను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. 

 

ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాలు పాఠ‌శాల‌ల‌ను, ఇత జ‌న‌స‌మూహ ప్ర‌దేశాల‌ను బంద్ చేస్తున్నాయి.  ఈ క్ర‌మంలో భార‌త్‌లో కూడా అనేక రాష్ట్రాలు త‌మ పాఠ‌శాల‌ల‌కు మార్చి 31వ తేదీ వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి. తాజాగా, తెలంగాణ‌లో కూడా పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. అంతేగాకుండా.. వివాహాల‌ను కూడా వాయిదా వేసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇవ‌న్నీ కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివార‌ణ‌కు తీసుకుంటున్న ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగ‌మేన‌ని, ప్ర‌జ‌లు కూడా స‌హ‌క‌రించాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వివాహాలేకాదు.. హానీమూన్ ట్రిప్‌లను కూడా వాయిదా వేసుకుంటున్నారు. తొలిరాత్రి మ‌హూర్తాల జోలికి వెళ్ల‌డం లేదు. అయితే.. క‌రోనా.. కాస్త క‌నిక‌రించ‌వే అంటూ కొత్త‌జంట‌లు వేడుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: