కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రపంచం మొత్తం భారతీయ సాంప్రదాయలవైపు నడుస్తోంది. భారత్ లో ఎలాంటి వైరస్ లు అయినా అధికంగా ప్రభలవు, అక్కడ వారు పాటించే సాంప్రదాయ పద్దతులే వారిని ఆరోగ్యవంతంగా ఉంచుతాయని భావించిన వివిధ దేశాలు, కరోనా వ్యాపించకుండా ఉండటానికి ప్రధానంగా షేక్ హ్యాండ్ దూరం చేసుకోవాలని, భారతీయ సాంప్రదాయమైన నమస్తే ని పాటించాలని ప్రకటించాయి.

IHG

ఇదిలాఉంటే అమెరికాలోని ఓ రాష్ట్రం మాత్రం ఎడ్డమంటే తెడ్డం అంటోంది. నమస్తే ని మేము ఎందుకు పాటించాలి. అలాంటివి మాకు కుదరవు అంటూ నమస్తే పై ఏకంగా నిషేధాన్ని ప్రకటించింది. మాకు షేక్ హ్యాండ్ అంటేనే ఎంతో నమ్మకం అంటూ నమస్తేనే ఎవరూ పాటించకండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో అలబామా రాష్ట్రం లోని ప్రతినిధుల సభ ఈ తీర్మానాన్ని చేసింది.

IHG

గతంలో అంటే 1993 లో కూడా యోగాపై నిషేధాన్ని విధించిన అలబామా ప్రభుత్వం ఎన్నో ఏళ్ళ తరువాత తాజాగా యోగాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశ పెట్టగా ఆమోదం తెలిపుతూ సుమారు 84 ఓట్ల తో తీర్మానం నెగ్గింది. కానీ నమస్తే పై తాజాగా నిషేధం విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరిని దృష్టిని తమవైపు తిప్పుకుంది. తమ రాష్ట్ర నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: